గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని… అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికి ఓటేసి.. పార్లమెంట్ ఎన్నికల్లో మరొకరికి ఓటేశారని.. దీని వల్ల ఫలితాలన్నీ తారుమారు అవుతాయని ఆందోళన చెందుతున్నారట.
ఎక్కడైనా బెట్టింగ్ అనేది కామన్. అది రాజకీయం అయినా.. క్రికెట్ అయినా.. ఇంకేదైనా. ఏపీ ఎన్నికలపై కూడా బెట్టింగ్ కోట్లలో జరుగుతోందట. అసలు.. బెట్టింగ్ రాయుళ్లకు హద్దూ అదుపే లేదట. అయితే.. బెట్టింగ్ అంటేనే ఎక్కువగా జరిగే గోదావరి జిల్లాలు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్‌కు ముందొచ్చిన వాళ్లు.. ఎందుకో కొంచెం అటూ ఇటూగా ఉన్నారట. ముందుగా వైసీపీపై 100 శాతం నమ్మకంతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు.. ఏపీలో భారీ క్రాస్ ఓటింగ్ జరిగిందని అనుమానిస్తున్నారట. దీంతో లెక్కలు తప్పేలా ఉన్నాయని భావిస్తున్నారట.
గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని… అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికి ఓటేసి.. పార్లమెంట్ ఎన్నికల్లో మరొకరికి ఓటేశారని.. దీని వల్ల ఫలితాలన్నీ తారుమారు అవుతాయని ఆందోళన చెందుతున్నారట. దీంతో ఇప్పుడు అందరి చూపు జనసేన వైపు మళ్లింది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఎంపీ స్థానాల్లో జనసేన గట్టి పోటీనే ఇస్తుందట. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా జనసేన వైపుకు మొగ్గు చూపుతున్నారు. జనసేనపై బెట్టింగ్ వేయడానికి సిద్ధపడుతున్నారు. జనసేనపై కూడా ఇప్పుడిప్పుడు ఆసక్తి కనబరుస్తున్నారు.