దళిత ద్రోహి చంద్రబాబు….ఇదిగో ప్రూఫ్

-

తెలుగుదేశం పార్టీలో దళితులకు ప్రాధాన్యం లేదని మరోసారి రుజువైంది.తన సామాజికవర్గానికి ఎక్కువగా పదవులిచ్చే చంద్రబాబు దళితులకు ఏనాడూ తగిన ప్రాముఖ్యత కల్పించింది లేదు.అవసరం ఉన్నంత వరకు వ్యక్తులను కులం పేరు చెప్పి వాడుకోవడం చంద్రబాబుకి నీళ్లు తాగినంత సులభం.దళితులకు పెద్దన్న తరహాగా ఉంటానని మాటలు కోటలు దాటించే చంద్రబాబు ….

వారిపట్ల వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. చిత్తూరు జిల్లా అధ్యక్షులు నాని నివాసానికి వెళ్లిన చంద్రబాబు పార్టీలోని సీనియర్ నేత,దళిత వ్యక్తి పట్ల అగౌరవంగా నడుచుకున్నారు.కనీసం కూర్చునేందుకు ఆ దళిత నేతకు కుర్చీ లేకపోవడం గమనార్హం.

సొంతూరు కుప్పంలో సంక్రాంతి సంబరాలను కుటుంబ సమేతంగా జరుపుకున్న చంద్రబాబు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను పరామర్శించారు.ఇందులో భాగంగా ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని ఇంటికి వెళ్లారు. ఇటీవల చేపట్టిన నిరసనలో నాని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపధ్యంలో నాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.నకిలీ ఓట్లపై బ్రహ్మాండమైన ప్రసంగం దంచిన చంద్రబాబు…దళిత సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రి పరసా వెంకటరత్నంను అవమానపరిచారు. కూర్చోమని చెప్పకుండా,,కనీసం కుర్చీ కూడా వేయకుండా అగౌరవంగా నడుచుకున్నారు. పరసారత్నంను నిలబెట్టి మరీ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పరసారత్నం. ఓసారి విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.అలాంటి వ్యక్తిని నిలబెట్టి అవమానపరిచారు.ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పనిచేయని వ్యక్తిని పక్కనే కూర్చోబెట్టుకున్నారు. బాబు తాజా వైఖరి పట్ల దళితులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునే చంద్రబాబును రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని సిద్ధమయ్యారు.ఇలాంటి వ్యక్తులు అధికారంలో ఉంటే దళితుల అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమవుతుందని,, జగన్ మళ్లీ గెలిపించుకుందామని దళిత సంఘాలు పిలుపునిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news