దిల్లీలో ముఖ్యమంత్రి వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా దిల్లీ ఎల్జీ వికే సక్సేనాకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. ఎల్జీ సాబ్ కాస్త చిల్ అవ్వండి.. మీ పైన ఉన్న మీ సూపర్ బాస్ ని కూడా కాస్త చిల్ అవ్వమనండి అని ట్విటర్ వేదికగా సెటైర్ వేశారు. అంతటితో ఆగకుండా.. ‘ఎల్జీ గారూ మీరు తిట్టినట్టు నా భార్య కూడా రోజూ తిట్టదు. గడిచిన ఆరు నెల్లలో ఎల్జీ రాసినన్ని ప్రేమలేఖలు నా భార్య కూడా నాకు రాసి ఉండదు’ అంటూ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో అభిప్రాయభేదాల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
మహాత్మా గాంధీ, లాల్ బహదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్, విజయ్ ఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరు కాకపోవడంపై ఆరా తీస్తూ ఇటీవల ఎల్జీ వికే సక్సేనా.. దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దిల్లీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని లేఖలో మండిపడ్డారు.
‘గాంధీ, శాస్త్రిలకు నివాళులు అర్పించే కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్ సహా ఎంతో మంది అతిథులు వచ్చారు. మీరు గానీ, మీ మంత్రులు గానీ రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌కు రాలేదు. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కొద్దినిమిషాలు ఉన్నా.. ఆయన ఈ కార్యక్రమాల్లో తగిన రీతిలో భాగం కాలేకపోయారు. దిల్లీ యంత్రాంగం నుంచి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా మీరు భాగం కాకపోవడం ఆమోదయోగ్యంగా కాదు’ అంటూ వీకే సక్సేనా తన లేఖలో పేర్కొన్నారు.
LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं।
पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे।
LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022