లిక్కర్ స్కామ్: నెక్స్ట్ కవిత? ఢిల్లీకి కేసీఆర్?

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతూ వస్తుంది..ఈ స్కామ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలని సైతం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల పేర్లు కూడా బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇటీవలే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ్ సైతం అరెస్ట్ అయ్యారు. అటు ఢిల్లీ ఆప్ మంత్రి మనీష్ సిసోడియా సైతం అరెస్ట్ అయ్యారు.

ఇక ఇప్పుడు కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారం మొదలైంది. తెలంగాణ కే‌సి‌ఆర్ కుమార్తె కవిత పేరు లిక్కర్ స్కామ్ లో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒకసారి సి‌బి‌ఐ సైతం కవితని విచారణ చేసింది. అయితే మంత్రి మనీష్ సైతం అరెస్ట్ అవ్వడంతో నెక్స్ట్ కవిత వంతు వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే మనీష్ అరెస్టుని బి‌ఆర్‌ఎస్ నేతలు ఖండించారు. బి‌జే‌పిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎవరెన్ని మాట్లాడినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని బి‌జే‌పి నేతలు అంటున్నారు.

మనీష్ సైతం అరెస్ట్ కావడంతో తర్వాత టార్గెట్ కవిత అవుతారని, త్వరలోనే కవిత కూడా అరెస్ట్ కావడం ఖాయమని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కే‌సి‌ఆర్ ఢిల్లీకి పయనమవ్వడం సరికొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీకి వెళ్ళి అక్కడ సి‌ఎం కేజ్రీవాల్‌తో కే‌సి‌ఆర్ చర్చిస్తారని తెలిసింది.

కానీ బి‌ఆర్‌ఎస్ విస్తరణ పనుల్లో భాగంగా కే‌సి‌ఆర్ ఢిల్లీకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ వర్గాలు అంటున్నాయి. అది కాదు కుమార్తెని కాపాడుకోవడం కోసం కే‌సి‌ఆర్ ఢిల్లీకి పయనమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే కే‌సి‌ఆర్ ఢిల్లీ టూర్ ఇంకా షెడ్యూల్ కాలేదు. ఓ వైపు ప్రీతి అంశం, మరోవైపు వీధికుక్కలు బారిన పడి చిన్నారి మృతి చెందడంపై కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఆడేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో లిక్కర్ స్కామ్ మరింత టెన్షన్ పెడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news