పోలీసుల వ‌ల్లే ధ్వంసం అయ్యాయి.. మేము కాదు – బీజేపీ కార్పొరేట‌ర్లు

జీహెచ్ఎంసీ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేట‌ర్లు జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఆందోళ‌న ల‌లో జీహెచ్ఎంసీ కార్యాల‌యం లో ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం అయ్యాయి. అలాగే కార్యాల‌యం లో పూల కుండీలు కూడా ధ్వంసం అయ్యాయి. దీని పై జీహెచ్ఎంసీ మేయ‌ర్ విజ‌య ల‌క్ష్మి తో పాటు న‌గ‌ర పుర‌పాలక మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.

బీజేపీ కార్పొరేట‌ర్ల పై నిప్పులు చేరిగారు. అలాగే ఆందోళ‌న లో పాల్గొన్న కార్పొరేట‌ర్ల పై పోలీసులు కేసు కూడా న‌మోదు చేశారు. కాగ జీహెచ్ఎంసీ కార్యాల‌యం లో ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం పై బీజేపీ కార్పొరేట‌ర్లు స్పందించారు. పూల కుండీ ల‌ను తాము ధ్వంసం చేయలేమ‌ని బీజేపీ కార్పొరేట‌ర్లు అన్నారు. త‌మ సమ‌స్య‌లు మేయ‌ర్ దృష్టి కి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో పోలీసులు త‌మ ను నెట్టార‌ని అన్నారు. పోలీసుల తోపులాట వల్లే కార్యాల‌యం లో పూల కుండీలు ధ్వంసం అయ్యాయ‌ని ఆరోపించారు.