ఎవరు రౌడీనో అందరికి తెలుసు… దేవినేని అవినాష్ తీవ్ర వ్యాఖ్యలు

Join Our Community
follow manalokam on social media

విజయవాడలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా విజయవాడ యువనేత, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంపీ కేశినేని నోరు అదుపులో పెట్టుకోవాలి అని హెచ్చరించారు. నగరంలో ఎవరు రౌడీయిజం చేశారో ప్రజలకు తెలుసు అని అన్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారిపై రౌడీయిజం చేసింది నాని మర్చిపోయారా అని ప్రశ్నించారు.

కూతురు మేయర్ కాలేకపోతుందని నాని డిప్రెషన్ మోడ్ లోకి వెళ్ళాడు అంటూ అవినాష్ తీవ్ర విమర్శలు చేసారు. నీకు ఓటు వేయమని చెప్పి వెంట తిరిగిన వారికి నువ్వు వెన్ను పాటు పొడిచావ్ అని ఆరోపించారు. ఎమ్మేల్యే గద్దె రాం మోహన్ ఒక షో మాస్టర్ అని ఎద్దేవా చేసారు. నగరాన్ని ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుతున్న పార్టీ వైసీపీ అని అవినాష్ అన్నారు.

నగరంలో అలజడులు సృష్టించాలని టీడీపీ చూస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అబద్ధపు ప్రచారాలు చేస్తూ టీడీపీ నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అని విమర్శించారు. మీరు నగరంలో చేస్తున్న గ్రూపు వివాదాలను ప్రభుత్వానికి ముడి పెట్టొద్దు అని హితవు పలికారు. టీడీపీ కార్యకర్తలని కూడా గుర్తు పట్టలేని పరిస్థితి లో ఎంపీ నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారన్నారు.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...