డైలాగ్ ఆఫ్ ద డే : ఒక ప‌రాజితుడి ఆత్మ క‌థ

-

ఆత్మ‌క‌థ రాయాల్సి వ‌స్తే ముందుగా కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ రాయాలి. అంటే అంత గొప్ప‌గా రాయాల్సి ఉంటుంద‌న్న మాట. ఆ విధంగా ఇప్ప‌టి ప‌రాజితుల ఆత్మ‌క‌థ‌లు ఎలా ఉంటాయో కానీ పాపం వీళ్లంతా ఇక‌పై జిల్లాల‌లో తలెత్తుకు తిరిగే ఛాన్సే లేద‌ని తేలిపోయింది. వైసీపీ అధికార నివాసంలో ఉండ‌డంతోనే ప‌రువు నిల‌బ‌డుతుంద‌ని అనుకుంటున్నారు. కానీ అధికార నివాసాలు ఖాళీ చేయాల్సి వ‌స్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆత్మ‌క‌థ‌లు రాసే ప‌నిలో ప‌డ్డారు మ‌న తాజా మాజీ మంత్రులు. ఆ క‌థ‌లో ఏమున్నాయో మ‌రి!

వెళ్లిపోవాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది..మంత్రుల‌కు మ‌రియు వారి అనుచ‌రుల‌కు కూడా ! ఎటువంటి పేచీ లేకుండా పేషీ ఖాళీ చేయాలి అని ఆర్డ‌ర్ వ‌చ్చింది. అందుకే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ వ‌చ్చినా త‌ట్టాబుట్టా స‌ర్దుకుని వ‌చ్చేశారు. సాధార‌ణ ప‌రిపాల‌న విభాగం జ‌స్ట్ ఒక కాల్ చేసి మీ సేవ‌లు ముగిసిన‌వి మీరు ఇక విడిది ఇల్లు ఖాళీ చేసి విడి విడిగా ఉండే ఏదో ఒక ఇల్లు చూసుకోండి. ఎందుకంటే నిన్న‌టిదాకా మంత్రులంతా గ్రూపు హౌసు లాంటి స‌చివాల‌యంలో ఉన్నారు క‌నుక ! ఆ మాట అని ఉంటారులేండి.

ఇక వెళ్లిపోతున్న మంత్రుల‌లో వీర‌విధేయులు ఏడుస్తున్నారు అదే ప‌నిగా అని వార్త‌లొస్తున్నాయి. పాపం త‌మ‌ను స‌రిగా ప‌నిచేయ‌నివ్వ‌లేద‌ని, లేదంటే ఇంత‌కుమించి ఫ‌లితాలు రాబ‌ట్టేవాళ్ల‌మ‌ని కూడా బీరాలు ప‌లుకుతున్నారు. రాగాలు తీస్తున్నారు. గారాలు పోతున్నారు. నీటిపారుద‌ల శాఖ మంత్రి ఇంకా చెప్పాలంటే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు చిరునామాగా నిలిచే అనిల్ త‌న‌కు ప‌ద‌వి పోవ‌డం ఆనందంగానే ఉంద‌ని ఇక‌పై నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తి దృష్టి సారిస్తాన‌ని అన‌డం విడ్డూరం.

అంటే ఇప్ప‌టిదాకా నెల్లూరుకు ఏమీ చేయ‌లేదా? చేయ‌కుండానే, చేయి అందివ్వ‌కుండానే కాలం గ‌డిపేశారా అన్న విమ‌ర్శ‌లూ వ‌స్తున్నాయి. ఇంకొంద‌రు హైద్రాబాద్ లో ఇంకొంద‌రు బెంగ‌ళూరులో ఉండి వచ్చేందుకు ప్లాన్ వేస్తున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి. వేస‌వి విడిదిని త‌నివితీరా అనుభ‌వించాక అప్పుడు డ్యూటీలో జాయిన్ కావాల‌ని యోచిస్తున్నారు. ఎలానూ పార్టీ ప‌ద‌వి అప్ప‌గిస్తారు క‌నుక అదేమంత ఫుల్ టైం జాబ్ కాదు క‌నుక కావాల్సినంత విశ్రాంతి తీసుకునే విధుల్లోకి రావాల‌ని యోచిస్తున్నార‌ని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news