కొన్ని కొన్ని కీలక అంశాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేల విషయంలో సీరియస్గా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి నష్టం చేస్తున్నారు అనే అభిప్రాయాన్ని జగన్ ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇప్పుడు కొన్ని సమస్యలు జనసేన పార్టీ నుంచి అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఎక్కువగా వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఈ రెండు పార్టీల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. కాపు సామాజిక వర్గం అధికార పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యేలను తిరుపతి పార్లమెంటు పరిధిలో ముఖ్యమంత్రి జగన్ వాడుకునే ప్రయత్నం చేశారు. అయితే కాపు సామాజికవర్గ నేతలు మాత్రం తిరుపతి పార్లమెంట్లో తిరగడం లేదని సమాచారం.
కొంతమందికి మంచి పదవులు ఇచ్చినా పార్టీలో దూరంగా ఉంటున్నారని ప్రభుత్వంలో ఉన్న సరే వాళ్ళు తనకు సహకరించడం లేదని జగన్ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల కంటే కూడా వ్యక్తిగత కార్యక్రమాల విషయంలో స్పీడ్ గా ఉన్నారని తిరుపతి ఎన్నికల ప్రచారంలో వెళ్లాలని తాను చెప్పిన సరే తన మాట లెక్క చేయడం లేదు అని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కొంతమంది కాపు సామాజిక వర్గాల ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించే అవకాశం ఉందని అంటున్నారు.