కరోనా వైరస్ కి మెడిసిన్ లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వం నివారణ ఒక్కటే మార్గం అని 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకువచ్చింది. ఒక మనిషి నుండి మరొక మనిషికి పంటి వ్యాధులు సోకే ఈ వైరస్ వల్ల దేశం మొత్తం నష్టం అయ్యే అవకాశం ఉందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రవాణా మరియు అన్ని రంగాలను స్తంభింప చేస్తూ లాక్ డౌన్ విధించింది. ఈ నిర్ణయంతో షాపింగ్ మాల్ సినిమా థియేటర్లు దేశవ్యాప్తంగా అన్ని మూతపడ్డాయి. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ నటీనటులు తమ తమ సినిమా షూటింగ్ ను ఆపేసి ఇళ్ళకి పరిమితమయ్యారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలులో ఉండటంతో, లాక్ డౌన్ ఎత్తేసిన గానీ ఈ ఎఫెక్ట్ ఈ సంవత్సరం చివరి వరకు ఉంటుందని వార్తలు వినబడుతున్నాయి. దీంతో టాలీవుడ్ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిణామాలు గురించి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ లో వినపడుతున్నాయి.
అదేమిటంటే ఏప్రిల్ నెలలో సినిమాలు విడుదల చేయాలని రెడీగా ఉన్న వాళ్ళు దాదాపు మూడు నెలల పాటు సినిమా రిలీజ్ ఆపేద్దామని అనుకుంటున్నారట. కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రజలలో బలంగా ఉండటంతో ఈ టైం లో సినిమా రిలీజ్ చేసి నష్టపోవడం గ్యారెంటీ అని నిర్మాతలు భావిస్తున్నారట. ఇంక ఇండస్ట్రీలో భారీ స్థాయిలో నిర్మాణమవుతున్న సినిమాలు…కరోనా వైరస్ కి మందు వచ్చాక అప్పుడు సినిమా రిలీజ్ తేదీలు ప్రకటించాలని చూస్తున్నట్లు సమాచారం.