క‌విత‌పై ఈట‌ల విమ‌ర్శ‌లు.. మ‌రి కేటీఆర్‌ను ఎందుకు ట‌చ్ చేయ‌లే?

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారంపై అనేక ర‌కాలుగా వినిపిస్తున్న వార్త‌ల‌కు ఆయ‌న నిన్న చెక్ పెట్టేశారు. ఆయ‌న ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఏ పార్టీలో చేర‌బోతున్నారు అనే వాటికి ఆయ‌న నిన్న చాలా క్లారిటీ ఇచ్చేశారు. కానీ నిన్న ప్రెస్‌మీట్‌లో ఎన్నో ర‌కాల సంచ‌ల‌న విషయాలు ఆయ‌న వెల్ల‌డించారు. కేసీఆర్ గురించి, క‌విత గురించి, హ‌రీశ్‌రావు గురించి మాట్లాడారు.

ఈట‌ల | కేటీఆర్‌

ఎక్కువ‌గా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసిన ఈట‌ల‌.. ఆయ‌న కూతురు క‌విత‌పై కూడా కొన్ని విమ‌ర్శ‌లు చేశారు. బొగ్గుగ‌ని కార్మిక సంఘం, విద్యుత్ కార్మిక సంఘాల‌కు క‌విత‌కు ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు. వాటిని ఉద్య‌మ కాలంలో తాము స్థాపిస్తే ఇప్పుడు క‌విత వాటిని హ్యాండిల్ చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ఆమె ఎప్పుడైనా ఆ సంఘాల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారా అంటూ ప్ర‌శ్నించారు. అయితే కేటీఆర్‌పై మాత్రం పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌లేదు ఈట‌ల రాజేంద‌ర్‌. ఆయ‌న‌పై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేటీఆర్‌పై వ్యూహాత్మ‌కంగానే విమ‌ర్శ‌లు చేయ‌లేదని తెలుస్తోంది. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు గ‌ట్టి పాయింట్ మీద కేటీఆర్‌పై విమ‌ర్శ‌లు చేయాల‌ని ఈట‌ల భావిస్తున్నారంట‌. ఆయ‌న‌పై మాట్లాడితే నిజ‌మే అన్నంత కార‌ణం ఉండాల‌ని ఈట‌ల ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం.