రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేక అలా చూస్తున్నాయి. రోజు రోజుకి లక్షల్లో కేసులు నమోదు కావడం వేలల్లో మరణాలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కాస్త ఇబ్బంది పడుతుంది అనే మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వ పెద్దలు లాక్ డౌన్ ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు.

election-commission-of-india

ఈ క్రమంలో దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రజలను మరింత ఇబ్బంది పెడుతుంది అనే మాట వాస్తవం. ఈ క్రమంలో ఎన్నికల కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మే2 న ప్రకటించనున్న ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు తరువాత అన్ని విజయ ఊరేగింపులను భారత ఎన్నికల సంఘం నిషేధించింది అని ప్రకటన విడుదల చేసింది.