ఏలూరికి కీల‌క రోల్‌.. అసెంబ్లీలో మోత‌మోగ‌నుందా..?

-

ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు ఎమ్మెల్యే..యువ నాయ‌కుడు.. ఏలూరి సాంబ‌శివ‌రావుకు టీడీపీ అధినేత‌ చంద్ర బాబు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు టీడీపీలో ప్ర‌చారం సాగుతోంది. నేటి నుంచి జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు త‌గ్గిపోయారు. ఉన్న‌వారిలోనూ ఎంత మంది మాట్లాడ‌తారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఉన్న‌వారిలో మెరిక‌ల వంటివారిని ఎంపిక చేసుకుని స‌భ‌లో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు, అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టే విధానంపై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

tdp

బాబు వ్యూహం ప్ర‌కారం.. ఏలూరికి వ్య‌వ‌సాయం, రైతులు, వ‌ర‌ద‌లు, పంట‌న‌ష్టం వంటి అంశాల‌ను కేటాయించారని తెలుస్తోంది. వ్య‌వ‌సాయ రంగంలో అనుభ‌వం ఉన్న ఏలూరి అయితే.. ఈస‌బ్జెక్టుపై జ‌గ‌న్ స‌ర్కారును గ‌ట్టిగా నిల‌దీస్తార‌ని బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. పైగా యువ నాయ‌కుడు, మంచి వాయిస్ ఉన్న నేత కావ‌డంతో ఏలూరిని ఎంచుకున్నార‌ని అంటున్నారు. గ‌త స‌భ‌లోనూ ఏలూరి ఎంచుకున్న అంశాల‌ను చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. ప్ర‌జాకోణంలో మంచి విష‌యాల‌ను లేవ‌నెత్తార‌ని ఆయ‌న‌ను కొనియాడారు.

ఇక‌, ఇప్పుడు స్వ‌యంగా చంద్ర‌బాబే.. స‌బ్జెక్టులు ఎంపిక చేసి.. ఎమ్మెల్యేల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ క్ర‌మంలోనే ఏలూరికి వ్య‌వ‌సాయం అప్పగించార‌నిఅంటున్నారు. ఇక‌, టిడ్కో ఇళ్ల విష‌యాన్ని.. మాజీ మంత్రి చిన‌రాజ‌ప్ప‌కు, సంక్షేమాన్ని అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌కు, పోల‌వ‌రం విష‌యాన్ని బుచ్చ‌య్య‌కు అప్ప‌గించార‌ని.. ఆయా అంశాల‌పై వారు ప‌ట్టు సాధించాల‌ని.. రెండు రోజుల కింద‌టే వారికిచంద్ర‌బాబు సూచించారు. అయితే.. ఈ అంశాలతో పోల్చుకుంటే.. వ‌ర‌ద‌లు, రైతులు, న‌ష్టాలు వంటి అంశం.. హాట్ టాపిక్ క‌నుక ఏలూరికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఆయ‌న ఎలా దూసుకుపోతారో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news