స్వ‌రం పెంచిన ఈట‌ల రాజేంద‌ర్.. కేసీఆర్ టార్గెట్‌గా ఆరోప‌ణ‌లు

ఈట‌ల రాజేంద‌ర్ రోజురోజుకూ టీఆర్ ఎస్‌పై స్వ‌రం పెంచుతున్నారు. కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. డైరెక్టుగానే స‌వాల్ విసురుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు కాస్త ఆచితూచి మాట్లాడిన ఈట‌ల రాజేంద‌ర్ ఇప్పుడు డైరెక్టుగా పేర్లు చెప్పి మ‌రీ హెచ్చ‌రిస్తున్నారు. హుజూరాబాద్ ప్ర‌జ‌ల మీద దాడిని ఆపాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈట‌ల‌.. ఉప ఎన్నిక‌కు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్నారు.

అందులో భాగంగా వ‌రుస‌గా ఊర్ల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న నుంచి విడిపోయిన వ‌ర్గీయుల‌ను మ‌ళ్లీ క‌లుపుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా కార్య‌క‌ర్త‌ల్లో భ‌రోసా నింపేందుకు ప్ర‌భుత్వంపై వాయిస్ పెంచి ప్ర‌చారం చేస్తున్నారు. త‌న‌పై కుట్రలు చేస్తే జనం కర్రు కాల్చి వాతపెడతారంటూ హెచ్చ‌రించారు.

ఇవ‌న్నీ చూస్తుంటే ఈట‌ల రాజేంద‌ర్ పూర్తి స్థాయిలో ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌యిన‌ట్టు తెలుస్తోంది. ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే ఊర్ల‌ళ్లో ప‌ర్య‌టిస్తున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. పోలీసులు కావాల‌నే తన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఈ రోజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్పుడు ప్ర‌భుత్వ ప‌నితీరుపై కూడా అనేక విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఏమేం లోపాలు ఉన్నాయో అవ‌న్నీ ఎత్తి చూపుతున్నారు. మొత్తానికి రాజేంద‌ర్ టీఆర్ ఎస్‌పై స్వ‌రం పెంచార‌ని చెప్పాలి.