ఈటల రాజేందర్ (Etela Rajender) వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో తీవవ్ర సంచలనంగా తయారైంది. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్‌లో చేరుతారా లేక బీజేపీలో చేరుతారా? అసలు ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ వినిపించిన ప్రశ్నలకు నిన్న ఆయన సమాధానం చెప్పారు. తన పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఆయన వచ్చే వారంలోగా బీజేపీలో చేరడం దాదాపు ఖాయమే అన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో అసలు ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి అసలు కారణం ఎవరనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈటల వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి. ఆయనకు బీజేపీ అసలు సెట్ కాదనేది మొదటి నుంచి ఉన్న వాదన. కానీ అనూహ్యంగా ఆయన బీజేపీవైపు వెళ్తున్నారు. ఇందులో ఇద్దరి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ ను బీజేపీలో చేరేందుకు తీవ్రంగా కృషి చేసి, మాట్లాడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనేది బీజేపీలో ఉన్న వాదన. అలాగే మరో సీనియర్ నేత అయిన వివేక్ వెంకటస్వామి రహస్యంగా ఈటలను తన ఫామ్‌హౌస్‌కి పిలిపించి మాట్లాడారు. ఆయన ఫామ్‌హౌస్ కేంద్రంగానే రాజకీయాలు నడిపించారు. బీజేపీలో చేరితే సమస్యల నుంచి బయట పడవచ్చంటూ వారిద్దరూ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఈటలను ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలిపించేందుకు కూడా వీరిద్దరే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంద. ఇదంతా బండి సంజయ్‌కు మింగుడు పడట్లేదనేది ఇప్పుడు బీజేపీలో వినిపిస్తున్న వాదన. చూడాలి మరి ముందు ముందు ఎలా ఉంటుందో.