యుపీలో అంతా బుల్డోజర్‌ బాబా హవానే నడుస్తుందా. . .

-

గుండాలపై బుల్డోజర్‌ అస్త్రాన్ని దింపుతోంది యుపీలోని యోగి సర్కార్‌. చెప్పినట్టుగానే క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న యోగి ఆదిత్యనాథ్‌ మాటవినని వారికి బుల్డోజర్‌తో చెక్‌ పెడుతున్నారు. అవును యుపీలో బుల్డోజర్‌ బాబా హవా కొనసాగుతోంది. ఒంటి చేత్తో ఉత్తరప్రదేశ్‌లో రెండు సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యోగీ దూకుడు ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. యూపీలోని ముస్లిం యువతలోనూ యోగీపై క్రేజ్‌ పెరిగింది. రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన పంథాను పూర్తిగా మార్చారు యోగీ బాబా.అవినీతి,హింస,క్రిమినల్స్‌,అత్యాచారాలపై కఠినంగా వ్యవహరించారు. ల్యాండ్‌ మాఫియా డాన్‌లను అణచివేసే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టారు.

రెండోసారి అధికారంలోకి రాకముందుకు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు బోల్డోజర్‌లను ప్రదర్శించారు. తాము మళ్ళీ అధికరాంలోకి వస్తే క్రిమినల్స్‌, మాఫియాపై బుల్డోజర్‌లను ఎక్కిస్తామని సింబాలిక్‌గా హెచ్చరించారు యోగి. ప్రజలను వంచించి ఆస్తులను నిర్మించుకున్న మాఫియాకు బుల్డోజర్‌లు సమాధానం చెప్తాయని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అప్పట్లో ఆదిత్యనాథ్‌ను బుల్డోజర్‌ బాబాగా పిలిచారు అఖిలేష్‌ యాదవ్‌. ల్యాండ్‌ మాఫియాను అణగదొక్కిన యోగి సర్కార్‌ ఇప్పటివరకు 67 ఎకరాల ప్రభుత్వ భూములను బుల్డోజర్‌ల సాయంతో విముక్తి కల్పించారు. పలు కేసుల్లో నిందితులుగా ఉండి తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి పోలీస్‌ ఫోర్స్‌ను బలంగా వినియోగించారు. దొరకని వారి ఇళ్ళపైకి బుల్డోజర్‌లను ప్రయోగించారు.

 

అవినీతిని ఏమాత్రం సహించనంటారు యోగి. అక్రమాలకు ఎవ్వరు పాల్పడినా వారికి గట్టిగా తగిలిస్తానని వార్నింగ్‌లు ఇచ్చారు. ఇందులో భాగంగానే అవినీతి ప్రజాప్రతినిథుల భరతం పట్టారాయన.నియమాలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ ఎమ్మెల్యేకి చెందిన పెట్రోల్‌ బంకును ధ్వంసం చేశారు.అలాగే అక్రమాలకు పాల్పడిన ఉన్నతస్థానంలో ఉన్న ఉద్యోగులను సైతం సస్పెండ్‌ చేయించారు. యోగి నిర్ణయాలకు 62 శాతం మంది యుపీ ప్రజలు మద్ధతుగా నిలుస్తున్నారంటే అక్కడి పరిస్థితులను ఆదిత్యనాథ్‌ ఎంతలా మార్చేశారో ఊహించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news