ప్రభుత్వ ఉద్యోగుల డబ్బును వాడుకున్న చంద్రబాబు సర్కార్..!

-

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం డబ్బుల్లేక ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి వెళ్లాక.. ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ నుంచి ఆయన డబ్బులు తీశారట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకోక ముందు నుంచే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఇటీవలే తెలిసింది. అయితే అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఏపీ అప్పులపాలై ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగుల డబ్బును కూడా వాడుకున్నారట. జగన్ సీఎంగా నిన్న నిర్వహించిన సమావేశంలో విస్మయాన్ని గొలిపే ఈ విషయాలు బయటకొచ్చాయి.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం డబ్బుల్లేక ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి వెళ్లాక.. ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ నుంచి ఆయన డబ్బులు తీశారట. ఆ డబ్బును ఏ పనుల కోసం ఉపయోగించారో తెలియదు కానీ.. ఇప్పుడీ విషయం తెలిశాక ప్రభుత్వ ఉద్యోగులు షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే.. జీపీఎఫ్ అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉద్యోగుల వేతనంలో నెల నెలా కొంత సొమ్ము జీపీఎఫ్‌లో జమ అవుతుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగులు తాము పదవీ విరమణ పొందాక తీసుకోవచ్చు. లేదా అత్యవసరం అయితే ముందుగానే డబ్బులను డ్రా చేసుకోవచ్చు.

అయితే సదరు జీపీఎఫ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సొమ్ము రూ.66,108 కోట్లను అప్పట్లో చంద్రబాబు సర్కారు పలు ఇతర పనులను ఉపయోగించుకున్నారట. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన ఇంత భారీ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. అయితే ప్రభుత్వం అలా ఉద్యోగుల సొమ్ము తీసకుంటే మళ్లీ దాన్ని జమ చేయాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలో జగన్ ఎలా ముందుకు ప్రొసీడ్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న ఇలాంటి షాకింగ్ నిర్ణయాలు, చేసిన పనులు నెమ్మదిగా ఒక్కోటి బయట పడుతున్నాయి. దీంతో టీడీపీలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇక ఇది ముందు ముందు ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news