టీఆర్ఎస్ పథకాలకు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ : వినోద్ కుమార్

బీజేపీ పై టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్ ప్రణాళిక సంఘం వైస్ చెర్మెన్ ఫైర్‌ అయ్యారు. బిజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసారని… బండి సంజయ్ కు ఇప్పుడు విద్యా వైద్యం గుర్తొచ్చిందని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ పాద యాత్ర టీఆర్‌ఎస్ పథకలకు బ్రాండ్ అంబాసిడర్ అని.. ఆయన పాద యాత్ర లో ఎటూ చూసిన పచ్చదనమే ఉంది..కాబట్టి ఆయనకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని చురకలు అంటించారు.

బండి సంజయ్ కు ప్రజలను నుండి స్పందన లేదని తెలిపారు. బండి సంజయ్ ఎంపీ గా వుండి పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఏం మాట్లాడడని… ఒక్క మెడికల్ కాలేజి మీరు తీసుకురాలేదని నిప్పులు చెరిగారు.

తెలంగాణకు మీరు ఒక్క రూపాయి ఇవ్వలేదని…అల్వాల్, ఎర్రగడ్డ, కొత్త పెట్ ఫ్రూట్ మార్కెట్ స్థలంలో ప్రభుత్వం మల్టిస్పెషలిటీ ఆసుపత్రులు నిర్మించబోతుందని తెలిపారు.. బిజేపీ వి పచ్చి అబద్దాలు..అని… తెలంగాణ లో బిజెపి వచ్చేది ఎప్పుడు సచ్చేది ఎప్పుడు..? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యోగులకు జీతాలు లేవు ఆలస్యం అనడం పచ్చి అబద్ధమని… బిజెపి పాలిత ప్రాంతాల్లో రెండు నెలలకు ఒకసారి జీతం ఇస్తున్నారని ఫైర్‌ అయ్యారు. బీజేపీ నిరాశా నిస్పృహ లో ఉందని.. నాగార్జున సాగర్ లో బీజేపీ కి డిపాజిట్ దిక్కు లేదని ఎద్దేవా చేశారు.