అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతి రోజు ఈ రెండు పార్టీల నేతలు ఒక్కరిపై ఒకరు విమర్శనస్త్రాలు సందించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అయితే.. ట్విట్టర్ తో పాటు మీడియా, పలు వేదికలపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాగే కొన్ని సార్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తు లేఖలు కూడా రాస్తున్నారు.
తాజా గా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ మరో లేఖ రాశారు. గత కొద్ది రోజుల నుంచి విరామం లేకుండా.. పెరుగుతన్న పెట్రోల్, డీజిల్ ధరలపై మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధనాల వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని లేఖలో విమర్శించారు. బీజేపీ చేసే దోపిడిని కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా.. అంటూ తీవ్రంగా విమర్శించారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ.. రాష్ట్రాలను మాత్రం పన్నులు తగ్గించాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.