గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రాజధాని రైతులు వినూత్న నిరసన తెలిపారు. అమరావతిని రక్షించాలంటూ శాసనసభ సమావేశాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు హారతులు ఇచ్చారు మహిళా రైతులు. సంకెళ్లతో వినూత్న ప్రదర్శన చేసిన కృష్ణాయపాలెం రైతులు… ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా శాసనసభలో మాట్లాడాలంటూ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ 352 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యేలు మంత్రులకు తమ మనోవేదన అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని మహిళలు, రైతులు మీడియాకు వివరించారు. శాసన సభా సమావేశాలు నాలుగో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశ పెడుతున్నారు. మూడు రోజుల పాటు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు.