టీడీపీ నుంచి 2014లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాకపోతే ఆయన్ను ఎస్సీ కోటాను టీడీపీ ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకుంది.
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఇవాళ ఉదయమే జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. ఆయన జనసేన పార్టీని వీడి వైసీపీలో చేరుతారని అంతా అనుకున్నారు. కానీ.. ఆయన మాత్రం ఇవాళ సాయంత్రం బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. దాదాపు ఓ గంట పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. దీంతో రావెల బీజేపీ చేరిక ఖాయం అని తెలుస్తోంది. కాకపోతే.. ఆయన ఎప్పుడు బీజేపీలో చేరుతారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
టీడీపీ నుంచి 2014లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాకపోతే ఆయన్ను ఎస్సీ కోటాను టీడీపీ ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకుంది. తర్వాత మంత్రి వర్గం నుంచి తీసేయడంతో ఆయన టీడీపీని వీడి జనసేనలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో కూడా జనసేన నుంచి అదే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు.
అయితే.. ఆయన ఓడిపోవడమే కాకుండా.. జనసేన ఒక్కటంటే ఒక్కటే సీటును గెలుచుకోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన జనసేన పార్టీకి ఇవాళ ఉదయమే రాజీనామా చేశారు. జనసేనకు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బీజేపీ నాయకుడితో భేటీ అయ్యారు. రావెల బీజేపీ చేరికపై కన్నా లక్ష్మీనారాయణ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని రావెల బీజేపీలో చేరుతారట.