నిజానికి జగన్.. రోజాను స్పీకర్ చేద్దామని అనుకున్నారట. కానీ.. రోజా తనకు స్పీకర్ పదవి వద్దని.. తనకు మంత్రి పదవే కావాలని జగన్‌ను కోరిందట. దీంతో జగన్ సరే.. తాను నిర్ణయం తీసుకుంటానని రోజాకు తెలిపారట. అయితే.. ఈ విస్తరణలో మాత్రం ఆమెకు చోటు దక్కలేదు.
ఈసారి కన్ఫమ్‌గా కేబినేట్‌లో బెర్త్ దక్కుతుంది అని అనుకున్న వారిలో మొదటి ప్లేస్‌లో నగరి ఎమ్మెల్యే రోజా ఉండేవారు. అంతే కాదు.. ఆమెకు హోంమంత్రిత్వ శాఖ అంటే ఇష్టమని చాలాసార్లు బహిరంగంగా కూడా చెప్పారు. దీంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. రోజా గెలిస్తే.. కచ్చితంగా హోంమంత్రి పదవి రోజాకే దక్కుతుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే రోజా గెలిచింది.. వైఎస్సార్సీపీ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ.. రోజాకు మాత్రం మంత్రి పదవి రాలేదు. జగన్ కేబినేట్‌లో ఉన్న 25 మందిలో రోజాకు స్థానం కల్పించలేదు.
నిజానికి జగన్.. రోజాను స్పీకర్ చేద్దామని అనుకున్నారట. కానీ.. రోజా తనకు స్పీకర్ పదవి వద్దని.. తనకు మంత్రి పదవే కావాలని జగన్‌ను కోరిందట. దీంతో జగన్ సరే.. తాను నిర్ణయం తీసుకుంటానని రోజాకు తెలిపారట. అయితే.. ఈ విస్తరణలో మాత్రం ఆమెకు చోటు దక్కలేదు.
ఈ మంత్రివర్గ విస్తరణలో మరో రెండున్నరేళ్ల వరకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవట. కాకపోతే రెండున్నరేళ్ల తర్వాత కేబినేట్ విస్తరణ ఉంటుందట. అప్పుడు రోజాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందట. అంటే రోజా మంత్రి అవ్వాలంటే మరో రెండున్నరేళ్లు ఆగాల్సిందేనా? లేక.. వేరే ఏదైనా పదవిని రోజాకు జగన్ కట్టబెడతారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.