రాజకీయాలకు దూరంగా గల్లా కుటుంబం.. కారణం అదేనా..??

-

చిత్తూరు జిల్లా టిడిపిలో జరుగుతున్న అంతర్గత విభేదాలతో ఓ ఫ్యామిలీ రాజకీయాలకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది.. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆ ఫ్యామిలీ ప్రస్తుతం టిడిపిలో ఎక్కడా కనిపించడం లేదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. టిడిపిలో జరుగుతున్న వర్గ విభేదాలు అసమ్మతినేతల దెబ్బకు విసిగిపోయారట.. దీంతో గత రెండున్నర ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు..


గల్లా అరుణకుమారి.. రాష్టంలో ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరేమో.. పాతూరి రాజగోపాల్ నాయుడు వారసురాలిగా ఆయన కుమార్తె గల్లా అరుణకుమారి 1989 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి చంద్రగిరి నుంచి విజయం సాధించారు.. అనంతరం 1999, 2004 2009 ఎన్నికల్లో విజయం సాధించి వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.. అనంతరం రాష్ట్ర విభజనతో రాజకీయాలకు దూరమయ్యారు..

గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ 2014 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి లోక్సభ పోటీ చేసి రెండు సార్లు గెలిచారు.. అయితే ఇటీవల గల్లా అరుణకుమారి భర్త గల్లా రామచంద్ర నాయుడు వ్యాపారాలకి గుడ్ బై చెప్పి గల్లా జయదేవ్ కి బాధ్యతలు అప్పగించారు.. దీంతో ఆయన పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమయ్యారు.. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో జయదేవ్ ఎక్కడా కనిపించలేదు.. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్లే టిడిపి కార్యక్రమాలకు జయదేవ్ హాజరు కావట్లేదు అని అయన సన్నిహితులు చెబుతున్నప్పటికీ.. మరొక ప్రచారం పార్టీలో నడుస్తుంది..

చిత్తూరు జిల్లాలో నేతల మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో గల్లా ఫ్యామిలీ విసిగిపోయిందని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని వ్యాపారాలు చేసుకోవాలని గల్లా ఫ్యామిలీ భావిస్తుందని.. వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీ చేసేది కూడా అనుమానమేనని ఆయన అనుచరులు సన్నిహితులు చర్చించుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news