కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నేతలకు గట్టి సందేశం ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పార్టీ అధినేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ సారథ్య బాధ్యతలను తాను ఇకపై నిర్వహించాలనుకోవడం లేదని తెలియజేశారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సూచిస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై సోనియా గాంధీ ఈ విధంగా స్పందించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ కు సంబంధించి అత్యున్నత మండలి అయిన సీడబ్ల్యూసీ భేటీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది.
దానికి ఒకరోజు ముందే సీనియర్లు లేఖ రాయడం, దానికి సోనియా రిప్లై ఇవ్వడం ఇప్పుడు కీలకంగా మారింది. అలాగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను ప్రకటించబోతునట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే సోనియా గాంధీ రాజీనామా చేస్తే.. పార్టీ బాధ్యతలు రాహుల్ స్వీకరిస్తారా, లేక వేరే ఎవరికైనా అప్పగిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.