GHMC 2020 election results : నేరేడ్ మెట్ మిన‌హా ఫ‌లితాల‌ లెక్కింపు పూర్తి

-

ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ మొద‌లైంది. గ్రేట‌ర్ పీఠాన్ని అధిరోహించేదెవ‌రో తేలిపోనుంది. మొత్తం 150 డివిజ‌న్లు, ఎక్స్ అఫీషియో (45) ఓట్ల‌తో క‌లుపుకొని మొత్తం సీట్లు 195గా ఉంది. ఇక ఎక్స్ అఫీషియో ఓట్లు పార్టీల వారిగా టీఆర్ెస్ కు 31 (గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 7 ఓట్ల‌ను ఉప‌యోగించుకుంది), బీజేపీకి 03, కాంగ్రెస్ కి 01, ఎంఐఎంకి 10 ఓట్లు ఉన్నాయి. ఏ పార్టీ అయితే 98 స్థానాల‌ను గెలుచుకుంటుందో ఆ పార్టీ గ్రేఠ‌ర్ మేయ‌ర్ పీఠాన్ని కైవ‌సం చేసుకుంటుంది.

GHMC elections 2020 live updates - manalokam.com
GHMC elections 2020 live updates – manalokam.com

– నేరేడ్ మెట్ మిన‌హా ఫ‌లితాల‌ లెక్కింపు పూర్తి
-బీజేపీ పార్టీ 50 స్థానాల్లో విజ‌యం సాధించే దిశ‌గా దూసుకుపోతుంది. గ‌త ఎన్నిక‌ల్లో 4 స్థానాలే గెలిచిన బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే 44 స్థానాల్లో గెలిచి 6 స్థానాల్లో ముందంజ‌లో ఉంది.
-ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని జ‌వ‌హార్ న‌గ‌ర్ లో బీజేపీ అభ్య‌ర్థి 10 ఓట్ల తేడాతో గెలుపొంద‌గా, రీకౌంటింట్ చెయ్యాలంటూ టీఆర్ెస్ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న డిమాండ్ చేశారు.
-50 స్థానాల్లో టీఆర్ెస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. పోస్ట‌ల్ బ్యాలెట్‌లో వెన‌కప‌డిన అధికార టీఆర్ెస్ పార్టీ ఓట్ల లెక్కింపు మొద‌లైన త‌రువాత పుంజుకుంది.
-కూక‌ట్‌ప‌ల్లి టీఆర్ెస్ కైవ‌సం.. ఓల్డ్ బోయిన్ ప‌ల్లి, బాలాన‌గ‌ర్‌, కూక‌ట్‌ప‌ల్లి, వివేకానంద‌న‌గ‌ర్, హైద‌ర్ న‌గ‌ర్‌, ఆల్విన్
కాల‌నీ 6 డివిజ‌న్ల‌ను కైవ‌సం చేసుకుంది.
-ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఫ‌లితాల ప్ర‌కారం టీఆర్ఎస్ 43 గెలిచి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
– ఎంఐఎం 37 స్థానాల్లో విక్ట‌రీ కొట్టి 05 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
– బీజేపీ 17 స్థానాల్లో విజ‌యం సాధించి 28 స్థానాల్లో ముందంజ‌లో ఉంది.
– కాంగ్రెస్ 02 స్థానాల్లో విజ‌యం సాధించింది.
– హ‌స్తినాపురం డివిజ‌న్ బీజేపీ చేజిక్కించుకుంది. సుజాతా నాయ‌క్ విజ‌యంతో బీజేపీ ఖాతాలో 18వ విజ‌యం చేరింది.
– హ‌బ్సిగూడ డివిజ‌న్‌లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఉప్ప‌ల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య బేతి స్వప్న‌పై బీజేపీ అభ్య‌ర్థి
చేత‌న విజ‌యం సాధించారు.
-ఖైర‌తాబాద్ డివిజ‌న్‌లో పీజేఆర్ కూతురు టీఆర్ెస్ అభ్య‌ర్థి విజయా రెడ్డి విజ‌యం సాధించారు.
– అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం ప్ర‌ద‌ర్శిస్తూ 17 స్థానాల్లో గెల‌వ‌గా 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
– బీజేపీ పార్టీ 07 స్థానాల్లో గెలుపొంది 34 స్థానాల్లో విజ‌యానికి చేరువ‌లో ఉంది.

పార్టీ ఆధిక్యం గెలుపు మొత్తం
టీఆర్ఎస్ 01 55 56
బీజేపీ 00 48 48
ఎంఐఎం 00 44 44
కాంగ్రెస్‌ 00 02 02
ఇత‌రులు 00 00 00

– ఉప్ప‌ల్ డివిజ‌న్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎం.ర‌జిత విజ‌యం సాధించారు. కాంగ్రెస్ గెలిచిన రెండూ స్థానాలు మ‌హిళ అభ్య‌ర్థులే కావ‌డం గ‌మ‌నార్హం.
-బీజేపీ ఆధిక్యంలోంచి గెలుపు.. ముషిరాబాద్ డివిజ‌న్ నుంచి ఎం.సుప్రియ‌, గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో గంగాధ‌ర్ గెలిచారు. మ‌రో 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్య‌ర్థులు మంచి మెజారిటీతో ముందంజ‌లో ఉన్నారు.
-కాంగ్రెస్ బోణి : ఏఎస్‌రావు న‌గ‌ర్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎస్‌.శిరీషారెడ్డి గెలుపొందారు.
-16 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
– పాతబ‌స్తీలో ఎదురులేని ప‌తంగి.. శాస్త్రీపురం డివిజ‌న్‌లో మ‌హ్మ‌ద్ ముబీన్‌, సులేమాన్ న‌గ‌ర్ డివిజ‌న్‌లో అబీదా సుల్తానా గెలుపొందారు.
-ర‌హ‌మ‌త్ న‌గ‌ర్ లో ఓట్ల లెక్కింపు నిలిపివేత‌.. బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఓట్లు తెర‌చి ఉండ‌టంతో వాటిని ప‌క్క‌న పెట్టారు ఎన్నిక‌ల సిబ్బంధి.
– ఓల్డ్ బోయిన్‌ప‌ల్లిలో టీఆర్ెస్ అభ్య‌ర్థి ఎం. న‌ర్సింహ యాద‌వ్‌ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు.
– చాంద్రాయ‌ణ గుట్ట‌లో ఎంఐఎం క్యాండిడేట్ అబ్దుల్ వాహెబ్ గెలుపొందారు.
-ఎల్బీనగర్​ నియోజకవర్గంలో 10 డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీజేపీ లీడ్‎లో ఉంది.
– ఎంఐఎం బోణీ.. మెహ‌దీప‌ట్నం డివిజ‌న్‌లో ఎంఐఎం పార్టీ అభ్య‌ర్థి మ‌జీద్ ఉస్సేన్ గెలుపొందారు.‌
– గోషామ‌హ‌ల్ – జాంబాగ్ డివిజ‌న్‌లో 471 ఓట్లు పోల్ అవ‌గా, బాక్స్‌లో 257 ఓట్లు ఉండ‌టంతో బీజేపీ పార్టీ ఆందోళ‌న‌కు దిగింది.
-కూక‌ట్ ప‌ల్లి డివిజ‌న్‌లో 190 పోస్ట‌ల్ ఓట్లు పోల్ అవ‌గా.. బీజేపీ 72, టీఆర్ఎస్ 59 , కాంగ్రెస్ 2, టీడీపీ 3 ఓట్లు పంచుకున్నాయి.‌
– పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో 1,926 పోల్ అవ‌గా ,అందులో దాదాపు 40శాతం చెల్లనివి
పోస్ట‌ల్ బ్యాలెట్ లో బీజేపీ హ‌వా
— జగద్గిరిగుట్టలో బీజేపీకి 1, టీఆర్ఎస్ 1, చెల్లనివి 03
— చింతల్‌లో బీజేపీకి 2 ఓట్లు రాగా మరో రెండు ఓట్లు చెల్లలేదు
— వనస్థలిపురం: బీజేపీకి 5, టీఆర్ఎస్ 2 నోటా 1
— చంపాపేట: బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1
— హస్తినాపురం: బీజేపీ 2, చెల్లనివి
— లింగోజిగూడెం: బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 1, టీజేఎస్ 1
— రంగారెడ్డి‌నగర్: బీజేపీ 3, టీఆర్ఎస్ 2
— గచ్చిబౌలి: టీఆర్ఎస్ 1, చెల్లనివి 2
— కొండాపూర్‌లో బీజేపీ 5, టీఆర్ఎస్ 1, నోటా 1, చెల్లనివి 7
— రామంతాపూర్: బీజేపీ 8, టీఆర్ఎస్ 2
—  ఉప్పల్ : బీజేపీ 10, కాంగ్రెస్ 4
—  మాదాపూర్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 2
—  మియాపూర్ : కాంగ్రెస్ 1, బీజేపీ 1,
—  హఫీజ్ పేట: బీజేపీ 4
—  చందానగర్‌ : బీజేపీకి 2, టీఆర్ఎస్ 1, చెల్లనివి 2 ఓట్లు పడ్డాయి.
—  బోయిన్ ప‌ల్లి పోస్ట‌ల్ బ్యాలెట్ టీఆర్ఎస్ 08 , బీజేపీ 07, చెల్ల‌నివి 02
– – హ‌య‌త్ న‌గ‌ర్ పోస్ట‌ల్ బ్యాలెట్ బీజేపీ 03, టీఆర్ెస్ 01, టీడీపీ 01

– బీజేపీ పార్టీ 24 స్థానాల‌లో ఆధిక్యంలో ఉండ‌గా, టీఆర్ెస్ 08 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
– ముషీరాబాద్, రాంనగర్, మలక్ పేట, గోషామహల్ డివిజనల్లో గంట ఆలస్యంగా కౌంటింగ్ ఆల‌స్యం.
– 150 కౌంటింగ్ కేంద్రాల్లో నాలుగు డివిజన్లు మినహా అన్ని సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
– పోస్ట‌ల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌తో ఎన్నిక‌ల కౌంటింగ్ మెద‌లు కానుంది.
– ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియ‌ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.
– ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లను సిద్ధం చేశారు.
– 30 సర్కిళ్లలోని 30 లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు.
– ఎన్నిక‌ల క‌మీష‌న్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా మొత్తం 150 డివిజన్లకు 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news