అమరావతి: మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. పోర్టు ప్రతిపాదిత గ్రామాలైన సిరివెళ్లపాలెం, గోపువానిపాలెం గ్రామాల్లో గురువారం పర్యటించిన ఆయన స్థానికులు, రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పోర్టుకు భూములు తీసుకునే విషయంలో మధ్యవర్తుల ద్వారా తాము నష్టపోతామన్న భావన రైతుల్లో ఉందని. ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగ యువతలోనూ పరిశ్రమల ఏర్పాటు విషయంలో అనుమానాలున్నట్లు గుర్తించామని లక్ష్మినారాయణ తెలిపారు. ముఖ్యంగా భూములు, పరిశ్రమల విషయంలో ప్రభుత్వం నేరుగా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని ఇదే విషయం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
బందరు పోర్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : జేడీ లక్ష్మినారాయణ
By ramu
-
Previous article
Next article