ట్వీట్లతో పార్టీ తయారు కాలేదు, కంప్యూటర్ లో పార్టీ పుంజుకోలేదు : గులాం నబీ ఆజాద్

-

కాంగ్రెస్ పార్టీ తమ రక్తంతో తయారైందని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పుడు కొందరు తనను అగౌరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ వారి ప్రయత్నాలన్నీ కంప్యూటర్లు, ట్వీట్లకే పరిమితమవుతాయని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని వీడిన ఆజాద్ తన రాజకీయ జీవితంలో కొత్త ఛాప్టర్ కు తెరలేపారు. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీలో కొత్త పార్టీపై ప్రకటన చేశారు. కశ్మీర్​కు రాష్ట్ర హోదాపై తన పార్టీ పనిచేస్తుందని ఆజాద్ తెలిపారు. భూములు, ఉద్యోగాలపై హక్కులు స్థానికులకే ఉండేలా పోరాడతామని చెప్పారు.
‘పార్టీకి ఇప్పుడే ఇంకా పేరు నిర్ణయించలేదు. పార్టీ పేరు, జెండా గుర్తులను ఇక్కడి ప్రజలే నిర్ణయిస్తారు. అందరికీ అర్థమయ్యే హిందుస్థానీ పేరునే పార్టీకి పెడతాం. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు బస్సుల్లో జైలుకు వెళ్తున్నారు. డీజీపీ, కమిషనర్లకు ఫోన్ చేసి తమ పేర్లు రాయించుకొని గంటలో బయటకు వస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పుంజుకోలేకపోతుంది’ అని ఆజాద్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news