హుజూరాబాద్‌లో రేవంత్‌కు వ‌రుస షాక్‌లు ఇస్తున్న హరీశ్‌రావు.. మ‌రో కీల‌క జంప్‌

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక పెనుమార్పులను తీసుకొచ్చింది, ఇంకా తీసుకురాబోతున్నదని చెప్పొచ్చు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో బై పోల్ అనివార్యం అయింది. అయితే, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాకపోయినప్పటికీ హుజురాబాద్ రాజకీయం రోజురోజుకూ ఇంకా హీటెక్కుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుల మీద ఎత్తులు వేసి మారీ ఈటలను ఓడించాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే ‘దళిత బంధు’ స్కీమ్‌ను పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌లో స్వయంగా సీఎం కేసీఆర్ లాంచ్ చేశారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మాజీ మంత్రి ఈటల అనుచర గణాన్ని పింక్ పార్టీలో చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కీలక నేతలను తమ గూటికి చేర్చుకుంటున్నారు. ఈటల అనుచరులకు పదవులు కట్టబెడుతున్నారు. ఈ క్రమంలోనే మొత్తంగా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే సీన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని టీపీసీసీ అధిష్టానం ఇంత వరకు ప్రకటించలేదు. ఇటీవల బీజేపీలో ఉన్న ఈటల అనుచరులను గులాబీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అనుచరులను కూడా గులాబీ గూటికి తీసుకుంటున్నారు. గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్‌రావు హుజురాబాద్‌పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో జ‌మ్మికుంట‌లో కాంగ్రెస్‌లో మంచి లీడ‌ర్‌గాగుర్తింపు తెచ్చుకున్న జ‌గ్గ‌య్య‌పల్లి స‌ర్పంచ్ క‌న‌ప‌ర్తి వంశీధ‌ర్‌‌ను గులాబీ పార్టీలోకి తీసుకున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న కాస్త బలాన్ని కూడా తీసేయాలనే ఆలోచనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటిలకే సీఎం కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కేసీఆర్. చూడాలి మరి.. మున్ముందు ఇంకెంత మంది ఇతర పార్టీ నేతలను పింక్ పార్టీలో చేర్చుకుంటారో..

Read more RELATED
Recommended to you

Latest news