దేశంలో రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది… బీజేపీ ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్

-

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. ప్రైవేటీకరణ చేయడం వల్ల మా బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని.. సీసీఐ, ఎల్ ఐసీ, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఇతర ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయంటూ.. ప్రశ్నించారు. టాటాకు, బిర్లా, అంబానీలకు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళలకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయన్నారు. దేశంలో  15 లక్షల ఖాళీలు ఉన్నా… కేంద్ర ప్రభుత్వం నింపడం లేదని అన్నారు. దేశంలో రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం ఎత్తేసే ప్రయత్నం చేస్తోందని.. బాబా సాహెబ్ అంబేద్కర్ తీసుకువచ్చిన రిజర్వేషన్లను కాలరాస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉన్న ఉద్యోగాలను, రిజర్వేషన్లను ఎత్తేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని ఆయన అన్నారు. సీసీఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ క్లీయర్ గా ఉందని.. సీసీఐని పునురుద్ధరించాలని.. కొత్త పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందో… సీసీఐకి కూడా ఇస్తామని హరీష్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news