ఏపీలో అత్యధిక మెజారిటీ ఆయనదే…అత్యల్ప మెజారిటీ ఎవరిదో తెలుసా…!

-

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గా సాగిపోయింది. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అనూహ్యమైన చారిత్రక విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన 88 సీట్లకు గాను ఇప్పటికే 135 సీట్లలో విజయ ఢంకా మోగించింది.అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక ,అత్యల్ప మెజారిటీలు టీడీపీ నేతలే సాధించారు.మడకశిర నుంచి టీడీపీ అభ్యర్ధి ఎం.ఎస్.రాజు తన ప్రత్యర్థి ఈర లక్కప్పపై 25 ఓట్ల స్పల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు మొత్తంగ 78,347 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పకు 78,322 ఓట్లు పోలయ్యాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ కావడం విశేషం.

ఎన్నికల ఫలితాల్లో ఏ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వస్తుందని.. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరిగింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్, జగన్, పురంధేశ్వరిలకు భారీ మెజార్టీ వస్తుందని బెట్టింగులు జోరుగా నడిచాయి. కానీ విశాఖ జిల్లా గాజువాఖలో టీడీపీ నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఎన్నికల అధికారి వెల్లడించిన లెక్కల ప్రకారం ఆయన 94,058 ఓట్ల మెజారిటీతో మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై భారీ విజయం సాధించారు. కాగా, రెండో అత్యధిక మెజార్టీ భీమిలి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు 92,401 దక్కింది. అలాగే మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ కూడా 91 వేల ఓట్ల మెజార్టీ సాధించారు.

ఇదిలా ఉండగా ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు అమరావతిలో ఏర్పాట్లపై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కి కీలక పదవి దక్కుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నారు.మంత్రి పదవుల కోసం పలువురు నేతలు ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు. మొత్తానికి ఏపీలో టీడీపీ రికార్డు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news