ఏపీ ప్రభుత్వానికి షాక్…!

-

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితి కార్యాలయాలకు వేసిన రంగుల విషయంలో సుప్రీం కోర్ట్, రాష్ట్ర హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ రంగులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసాయి, సుప్రీం కోర్ట్ ఈ విషయంలో ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయ రంగు వేస్తే ఊరుకుంటారా అంటూ ప్రశ్నించింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రంగులను తొలగించే విషయంలో ముందుకి వెళ్ళడం లేదు.

దీనితో హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది… ఏపీ సర్కార్ రంగులను తొలగించడానికి గానూ తమకు సహాయం కావాలని కోరగా… అందుకు హైకోర్ట్ నిరాకరించింది. గడువు ఇవ్వలేము అని స్పష్టం చేసింది. వీలైనంత వేగంగా వాటిని తొలగించాలి అని స్పష్టం చేసారు. మూడు నెలల సమయం కోరింది ఏపీ సర్కార్. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితి కార్యాలయాలకు రంగులు వేసింది ఏపీ సర్కార్.

దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము ఆ రంగులు వేయలేదు అని ఏపీ సర్కార్ కోర్ట్ లో చెప్పినా సరే కోర్ట్ అంగీకరించలేదు. వెంటనే తొలగించాలి అంటూ స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే లోపు రంగులు లేకుండా చూడాలని చెప్పినట్టు తెలుస్తుంది. దీనితో ఇప్పుడు ఏపీ సర్కార్ రంగులను తొలగించే విషయంలో ముందుకి వెళ్ళాలి అని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news