హుజూరాబాద్ పోల్: కృష్ణయ్యకు ఆ సత్తా ఉందా?

-

హుజూరాబాద్ ఉపఎన్నికకు కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉంది…ఇక ఈలోపు ఎవరికి వారు….ఓటర్లని ఆకర్షించి తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రలోభాల పర్వం తారస్థాయికి చేరుకుంది. అవసరాన్ని బట్టి పార్టీలు ఓటుకు ఎంత ఇస్తున్నారో కూడా క్లారిటీ ఉండటం లేదు. విపరీతంగా డబ్బులు వెదజల్లుతున్నారు. ఇక ఓటుకు నోటు అందని ప్రజలు రోడ్లపైకి రచ్చ చేస్తున్నారు. అంటే బహిరంగంగానే డబ్బుల పంపకం జరిగిపోతుందని అర్ధమవుతుంది.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

ఇక ఓటుని నోటు పెట్టి కొనేస్తున్నారు. అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక బాగా కాస్ట్‌లీ ఎన్నిక కానుందని అర్ధమవుతుంది. ఇక ఓ వైపు నోటులతో ఓట్లు కొనేస్తూనే మరోవైపు…కులాల వారీగా ఓట్లని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘంతో పాటు 120 బీసీ కులాలు హుజూరాబాద్‌ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌కే మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

అంటే ఇదివరకే మద్ధతు ప్రకటించిన కృష్ణయ్య..మళ్ళీ ఎన్నిక ముందు మరొకసారి మద్ధతు ఇచ్చారు. దీంతో కృష్ణయ్య టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా రాబోతుందని ప్రచారం నడుస్తోంది. కానీ తాను టీఆర్ఎస్‌లో చేరడం లేదని, కేసీఆర్ బీసీ గణన కోసం తీర్మానం చేయడం, బీసీ బంధు అమలుకు హామీ ఇచ్చిన నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అంటే తీర్మానం చేస్తే సరిపోతుందా? అంటే చాలదనే చెప్పాలి. కానీ రాజకీయంగా లబ్ది పొందడానికే కృష్ణయ్య ఈ ఎత్తు వేసినట్లు తెలుస్తోంది.

అయినా కృష్ణయ్య చెబితే….బీసీలు ఓట్లు వేసేస్తారా? అంటే వేయరనే చెప్పాలి. ఎందుకంటే బీసీల హక్కుల కోసం పోరాడుతున్నట్లు హడావిడి చేసే కృష్ణయ్య ఇంతవరకు బీసీల కోసం సాధించింది ఏంటో తెలియదు. పైగా ఈయన అవసరానికి తగ్గట్టుగా రాజకీయం చేస్తారు…మొదట్లో వైఎస్సార్, తర్వాత చంద్రబాబు, ఇప్పుడు జగన్, కేసీఆర్‌లకు అనుగుణంగా రాజకీయం నడుపుతున్నారు. కాబట్టి కృష్ణయ్య చెబితే హుజూరాబాద్‌లో బీసీలు ఏమి మారిపోరనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news