Round Wise Results : హుజూరాబాద్ – ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు

-

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఒక్కొక్క‌టిగా ఫ‌లితాలు వ‌స్తున్నాయి. మొత్తంగా 2 లక్షల 5 వేల 236 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 22 రౌండ్ల‌లో లెక్కింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు చేశారు. మొదటి 6 రౌండ్లలో హుజూరాబాద్ మండల ఓట్లు.. 7వ రౌండ్‌ నుంచి 10వ రౌండ్ వరకు వీణవంక ఓట్లు.. 11 నుంచి 15వ రౌండ్ వరకు జమ్మికుంట మండల ఓట్లు.. 16 నుంచి 18వ రౌండ్ వరకు ఇల్లందకుంట మండల ఓట్లు.. 19 నుంచి 22వ రౌండ్ వరకు కమలాపూర్ మండల పరిధిలోని ఓట్లు లెక్కిస్తారు.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

22వ రౌండ్‌‌

22వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 1,130 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 21,015 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 82,348 బీజేపీ 1,06,213 కాంగ్రెస్ 3,012 సంపాదించారు. 22వ రౌండ్ ముగిసేసరికి ఈటల 23,865 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

21వ రౌండ్‌‌

21వ రౌండ్లు లో ఏకంగా 28,865 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 78,997 బీజేపీ 1,01,732 కాంగ్రెస్ 2,767 సంపాదించారు. 21వ రౌండ్ ముగిసేసరికి ఈటల 28,865 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

20వ రౌండ్‌‌

20వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 1,474 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 21,015 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 75,566 బీజేపీ 96,581 కాంగ్రెస్ 2,767 సంపాదించారు. 20వ రౌండ్ ముగిసేసరికి ఈటల 21,015 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

19వ రౌండ్‌‌

19వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 3,047 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 19,541 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 68,902 బీజేపీ 91,312 కాంగ్రెస్ 2660 సంపాదించారు. 19వ రౌండ్ ముగిసేసరికి ఈటల 19,541 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

18వ రౌండ్‌‌

18వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 1876 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 19,541 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 68,902 బీజేపీ 85,396 కాంగ్రెస్ 2,266 సంపాదించారు. 18వ రౌండ్ ముగిసేసరికి ఈటల 16494  ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

17వ రౌండ్‌‌

17వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 1,423 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 14,618 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 65,167 బీజేపీ 79,785 కాంగ్రెస్ 2,266సంపాదించారు. 17వ రౌండ్ ముగిసేసరికి ఈటల 14,618 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

16వ రౌండ్‌‌

16వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 1,712 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 13,255 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 60,920 బీజేపీ 74,175, కాంగ్రెస్ 2,131సంపాదించారు. 16వ రౌండ్ ముగిసేసరికి ఈటల 13,255 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

15వ రౌండ్‌‌

15వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 2, 149 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 11,583 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 57,003 బీజేపీ 68586, కాంగ్రెస్ 1,982 సంపాదించారు. 15వ రౌండ్ ముగిసేసరికి ఈటల 11,583 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

14వ రౌండ్‌‌

14వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 1,046 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 9,434 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 53, 645, బీజేపీ 63,079, కాంగ్రెస్ 1,830ఓట్లు సంపాదించారు. 14వ రౌండ్ ముగిసేసరికి ఈటల 9,434 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

13వ రౌండ్‌‌

13వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 1,865 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 8,388 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 49,945, బీజేపీ 58,333, కాంగ్రెస్ 1729 ఓట్లు సంపాదించారు. 13వ రౌండ్ ముగిసేసరికి ఈటల 8,388 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

12వ రౌండ్‌‌

12వ రౌండ్లు లో ఈటల రాజేందర్ కు ఏకంగా 1,217 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 6,523 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 46,974, బీజేపీ 53,497, కాంగ్రెస్ 2524 ఓట్లు సంపాదించారు. 12వ రౌండ్ ముగిసేసరికి ఈటల 6,523 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

11వ రౌండ్‌‌

11వ రౌండ్లు లో గెల్లు శ్రీనివాస్ర్‌ కు ఏకంగా 367 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 5,264 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 43,324 , బీజేపీ 48,588, కాంగ్రెస్ 2524 ఓట్లు సంపాదించారు.11వ రౌండ్ ముగిసేసరికి ఈటల 5,264 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

10వ రౌండ్‌‌

10వ రౌండ్లు లో ఈటల రాజేందర్‌ కు ఏకంగా 526 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 5,631 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 39016 , బీజేపీ 44,647 , కాంగ్రెస్ 2524 ఓట్లు సంపాదించారు. 10వ రౌండ్ ముగిసేసరికి ఈటల 5,631 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

9వ రౌండ్‌‌

9 వ రౌండ్లు లో ఈటల రాజేందర్‌ కు ఏకంగా 1835 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 5105 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ 35,307 , బీజేపీ 40,412 , కాంగ్రెస్ 1,349 ఓట్లు సంపాదించారు. 9వ రౌండ్ ముగిసేసరికి ఈటల 5,105 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

8వ రౌండ్‌‌
8 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 3,270 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ 31,837, బీజేపీ 35,107, కాంగ్రెస్ 1,175 ఓట్లు పోలయ్యాయి. 8వ రౌండ్ ముగిసేసరికి ఈటల 3270 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉన్న వీణవంక లో కూడా 
టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉన్న వీణవంక మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్‌ జరుగుతోంది. అయితే.. ఇక్కడ కూడా బీజేపీకే ఓట్లు ఎక్కువగా పడటం గమనార్హం.

ఏడో రౌండ్‌
పోస్టల్‌ బ్యాలెట్‌ మినహా… అన్ని రౌండ్లల్లోనూ… అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి… ఎదురు దెబ్బ తగిలింది. ఏడో రౌండ్ లో భారతీయ జనతా పార్టీకి 4044 ఓట్లు పోల్‌ కాగా టీఆర్‌ఎస్‌ పార్టీకి 3792 పోల్‌ అయ్యాయి. ఇప్పటి వరకు బీజేపీ పార్టీకి 31,027 పోల్‌ కాగా… టీఆర్‌ఎస్‌ పార్టీకి.. 27,589 ఓట్లు పోల్‌ అయ్యాయి. అటు కాంగ్రెస్‌ పార్టీకి 1086 ఓట్లు పోల్‌ అయ్యాయి.

ఆరో రౌండ్‌
ఆరో రౌండ్ కౌంటింగ్ లో బీజేపీ 1,017 ఓట్ల మెజారిటీ సాధించింది. ఇప్పటివరకూ 3,186 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. ఆరు రౌండ్లలో గెల్లు శ్రీనివాస్ మొత్తం 23,797 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ మొత్తం ఓట్లు 992 పోలయ్యాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో 5 రౌండ్ల తర్వాత కూడా కాంగ్రెస్ ఓట్లు వెయ్యి దాటలేదు. బద్వేల్ కంటే హుజూరాబాద్‌లోనే కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు పోలయ్యాయి.

ఐదో రౌండ్‌ 
ఐదో రౌండ్‌ లో ఈటల రాజేందర్‌ కు 4358 ఓట్లు పోల్‌ కాగా… గెళ్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కు 4014 ఓట్లు పోల్‌ అయ్యాయి. దీంతో బీజేపీ పార్టీకి 344 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక ఓవరాల్‌ గా చూసుకున్నట్లయితే… 5 రౌండ్ల త‌రువాత బీజేపీకి 2,169 ఓట్ల ఆధిక్యం లభించింది.

నాలుగ‌వ రౌండ్‌
నాలుగు రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు 1835 ఆధిక్యత రాగా.. ఫలితంగా బీజేపీ పార్టీకి మొత్తం నాలుగు రౌండ్లకు కలిపి 17,969 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 16114 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకీ 680 ఓట్లు మాత్రమే వచ్చాయి.

శత్రువు కు శత్రువు మిత్రుడు
ఈటెలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇవ్వబోతున్నారని… శత్రువు కు శత్రువు మిత్రుడన్నట్టు ఈటెలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీ
రెండు పార్టీల మ‌ద్య పోటీ నువ్వా, నేనా అన్న‌ట్లుగా ఉన్నా.. బీజేపీ పార్టీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ముందంజ‌లో ఉన్నారు. రెండు పార్టీల మ‌ద్య 1.7 శాతం తేడా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన రౌండ్ల వారి ఫ‌లితాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

మూడో రౌండ్‌
మూడో రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి ఈటల 1269 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లు కలిపి ఈటలకు 13,525 ఓట్లు,  గెల్లు శ్రీనివాస్ కు 12,262 ఓట్లు , బల్మూరి వెంకట్ కు 446 ఓట్లు పోలయ్యాయి. మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఈటల 1273 ఓట్లతో ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఇప్పటివరకు మూడు రౌండ్ ల రిపోర్టులు రాగా ఇంకా 19 రౌండ్ ల రిపోర్టులు రావాల్సి ఉంది.

రెండో రౌండ్
తాజా రెండో రౌండ్ ముగిసే సరికి.. రెండు రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు 9461 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 9103 ఓట్లు వచ్చాయి. ఫలితంగా 339 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది.

తొలి రౌండ్
166 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్. రోటీ మేక‌ర్ గుర్తుకంటే త‌క్కు ఓట్లతో వెనుకబ‌డిన కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్‌ 4444, బీజేపీ 4610, కాంగ్రెస్‌ 119

 

Read more RELATED
Recommended to you

Latest news