హుజూరాబాద్ వార్: మెయిన్ లాజిక్ మిస్ అయిన టీఆర్ఎస్….

ఎంతసేపు ఈటల రాజేందర్‌ని ఓడించాలనే చూస్తున్న అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ అసలు లాజిక్ మిస్ అయినట్లే కనిపిస్తోంది. అంటే ఆ లాజిక్ వల్ల తమకే నష్టం జరుగుతుందని కే‌సి‌ఆర్, హరీష్ రావులు తెలివిగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. కానీ జనాలు మాత్రం ఆ లాజిక్ దగ్గరే ఆగిపోయారని చెప్పొచ్చు. అసలు మిస్ అయిన లాజిక్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే…ఈటల రాజేందర్‌కు టి‌ఆర్‌ఎస్‌లో ఎలాంటి పొజిషన్‌ ఉందో చెప్పాల్సిన పని లేదు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

అలాగే తాము గులాబీ ఓనర్లమని మాట్లాడక, ఈటలని ఎలా సైడ్ చేస్తూ వచ్చారో కూడా తెలిసిందే. అసలు ఊహించని విధంగా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఇక అధికార పార్టీలో అనేక మంది నేతలపై ఆరోపణలు వచ్చాయి గానీ, కే‌సి‌ఆర్ మాత్రం ఈటలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే విచారణ వేయించారు. సరే ఇంతవరకు బాగానే ఉంది….మరి విచారణ చేసి ఏం చేశారు? అసలు ఆ విచారణ ఏమైంది? అనేది ఎవరికి తెలియదు.

అలా ఆరోపణలు రావడంతోనే ఈటల…టి‌ఆర్‌ఎస్‌ని వదిలేశారు. అలాగే నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి బి‌జే‌పిలో చేరే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ టి‌ఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేత కే‌సి‌ఆర్ ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఇక ఇక్కడే ఎవరి నిబద్ధత ఏంటి అనేది అర్ధమైపోతుంది.

ఇక ఈటల రాజీనామా చేసాకే…హుజూరాబాద్ పోరు ఇంతవరకు వచ్చింది. ఆయన రాజీనామా చేసాకే టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం…హుజూరాబాద్ ప్రజలకు బంపర్ ఆఫర్లు ఇస్తుంది. అయితే ఈటలని ఓడించడానికి టి‌ఆర్ఎస్ ఇలా చేస్తుంది గానీ, అవి ఆటోమేటిక్‌గా ఈటలకు బెనిఫిట్ అవుతున్నాయి. పైగా ఈటలని ఏ కారణంతో అయితే పార్టీ నుంచి పంపించేశారో…ఆ భూ కబ్జా ఆరోపణలని టి‌ఆర్‌ఎస్…హుజూరాబాద్ ప్రచారంలో చేయడం లేదు. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి గురించి, అలాగే ఈటల ఏదో కే‌సి‌ఆర్‌ని మోసం చేశారని మాత్రం విమర్శలు చేస్తున్నారు.

అంటే ఆ భూ కబ్జా ఆరోపణలు రాజకీయంగా క్రియేట్ చేసిన ఒక సినిమా అని అర్ధమవుతుంది. ఒకవేళ అవే ఆరోపణలు ఎన్నికల ప్రచారంలో చేస్తే సానుభూతి పెరిగి ప్రజలు మరింతగా ఈటలకు మద్ధతుగా ఉంటారని టి‌ఆర్‌ఎస్‌కు బాగా డౌట్ వచ్చింది…అందుకే ఆ ఆరోపణల గురించి అసలు మాట్లాడటం లేదు. మొత్తానికి హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ చేస్తున్న రాజకీయం ఏంటో క్లియర్ గా అర్ధమవుతుంది.