తాను తలుచుకుంటే ఏపీ సిఎం వైఎస్ జగన్ తన ఇల్లు దాటి బయటకు రాలేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఒక పిరికి సీఎం అని ఆయన ఆరోపించారు. జగన్ చర్యలు అన్ని గుర్తు పెట్టుకుంటాము అని ఆయన స్పష్టం చేసారు. అధికారులు భవిషత్ లో తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారు అని ఆయన హెచ్చరించారు. వడ్డీతో సహా అన్ని చెల్లిస్తాం అని హెచ్చరించారు.
అధికారులు అయిన వైసీపీ నేతలు అయినా అన్ని గుర్తు పెట్టుకుంటాం అని ఆయన అన్నారు. నాయకులను కొడితే టీడీపీ పారిపోతుంది అనుకుంటున్నాడు సీఎం అని, మేము తలుచుకుంటే సీఎం తాడేపల్లి ప్యాలెస్ దాటి రాలేడు అని వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలపై దాడిని వదిలిపెట్టేది లేదు అని ఆయన హెచ్చరించారు. కోర్టులను ఆశ్రయిస్తాము….గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాము అన్నారు.
ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని ఆవేదన వ్యక్తం చేసారు. రాజారెడ్డి రాజ్యాంగం కావాలో అంబేద్కర్ రాజ్యాంగం కావాలో ప్రజలే తేల్చుకోవాలి అని ప్రజల నుండి తిరుగుబాటు వస్తే వైసీపీ నాయకులు బయట ఎలా తిరుగుతారు అని ఆయన ప్రశ్నించారు. పంచాయతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది అన్నారు. జగన్ పిల్లి-చంద్రబాబు పులి అని పంచాయతి ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇచ్చారు అని, సీఎం జగన్ ఒక పిరికివాడు అని ఎద్దేవా చేసారు. ప్రజలు మీ వైపు ఉంటే పోలీసులను ఉపయోగించి టీడీపీ కార్యకర్తలను ఎందుకు కొడుతున్నారు అని నిలదీశారు. టీడీపీ నాయకులను బెదిరిస్తున్నారు…పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు అన్నారు. జగన్ రెడ్డి పిరికివాడు కాబట్టి ప్రజలను బెదిరిస్తున్నారు అని ఆరోపించారు.