టీడీపీకి మరో బెజవాడ అవుతున్న గుంటూరు…?

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని కొన్ని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రధాన నాయకుల మధ్య విభేదాలు పార్టీలో చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారాయి అనే భావన కొంత మందిలో ఉంది. చంద్రబాబునాయుడు కొన్ని కొన్ని అంశాలను ముందు నుంచి కూడా చాలావరకు తేలికగా తీసుకుంటారు. దీనికి కారణంగా నేతలు కూడా ఎక్కువగా చెలరేగిపోతు ఉంటారు.

విజయవాడ పరిధిలో దాదాపు అదే జరిగింది. ఇప్పుడు గుంటూరు పరిధిలో కూడా దాదాపుగా అలాంటి రాజకీయం నడుస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుంటూరులో కొంతమంది పనిచేయకపోవడంతో కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మేయర్ అభ్యర్ధి ఎంపిక విషయంలో నేతల మధ్య సమన్వయం కనపడలేదు. దీని కారణంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ధైర్యం ఎవరూ కూడా ఇవ్వలేదు.

చంద్రబాబు నాయుడు ఒక రోజు ప్రచారం చేశారు. ఆ రోజు మినహా నేతలు ఎవరూ కూడా పార్టీ కోసం కష్ట పడిన పరిస్థితి లేదు. మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు గానీ మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎమ్మెల్యేలు గానీ గుంటూరు జిల్లా పరిధిలో ఎక్కడా కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. పార్లమెంటు అధ్యక్షులు కూడా పెద్దగా మాట్లాడే పరిస్థితి కనబడలేదు. ఎంపీ గల్లా జయదేవ్ కూడా పెద్దగా తిరగలేదు. ఇక మైనారిటీ వర్గాల్లో ప్రచారం చేసే నాయకులు కూడా పెద్దగా ఎవరూ తెలుగుదేశం పార్టీలో కనపడలేదు. గతంలో పదవులు అనుభవించిన వాళ్ళందరూ ఎప్పుడు సైలెంట్ గా ఉండటం తో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని దెబ్బ ఎదుర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news