రెండు నెలల్లో శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి !

-

కరోనా వైరస్ అనే మహమ్మారి నుండి ప్రపంచ దేశాలను కాపాడటానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడానికి రాత్రింబగళ్లు అనేక పరిశోధనలు జరుపుతున్నారు. రోజు రోజుకి ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆందోళన చెందుతుంది. మరోపక్క ప్రపంచ దేశాలు మందులేని ఈ వైరస్ నీ ఎదుర్కోవాలంటే నియంత్రణ ఒకటే మార్గం కావడంతో లాక్ డౌన్ నీ కఠినంగా అమలు చేయడంతో భయంకరమైన ఆర్థిక నష్టాన్ని చూస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వైరస్ వ్యాక్సిన్ విషయంలో వచ్చిన వార్తలు దాదాపు సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి.Potential COVID-19 therapeutics currently in developmentఅయితే తాజాగా హైదరాబాద్ కి చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ రెండు నెలల్లో శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి అంటూ కాన్ఫిడెంట్ గా చెబుతోంది. తాజాగా క్రియారహిత వైరస్ టీకాలు మానవ శరీరంలోకి పంపించి అది వైరస్ కి సంబంధించిన సమాచారాన్ని రోగనిరోధక వ్యవస్థకు అందజేసి… దానికనుగుణంగా వైరస్ పై దాడి చేయాలని ప్రయత్నిస్తోంది. వైరస్ సోకినప్పుడు యాంటీబాడీలు భారీగా రిలీజ్ అయ్యి నిర్వీర్యం చేస్తాయి.

 

దీంతో వైరస్ చనిపోయే అవకాశం ఉంది, అని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. దీంతో చేస్తున్న పరిశోధనలో చాలా వరకూ సానుకూల ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. ఈ టికాకి పరిశోధనలు వేగవంతం చేశామని ఆయన తెలిపారు. పోలియో మరియు రేబిస్, టీకాలు ఈ విధంగానే తయారు చేసాము అని తెలిపారు. దీంతో ప్రయోగాలు మొత్తం అంతా సక్సెస్ అయితే రెండు నెలల్లోనే ఈ టీకా అందుబాటులోకి వస్తుందని రాకేష్ మిశ్రా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news