కొత్త కొత్త పుకార్లతో హడలెత్తిస్తున్నారు !

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాదాపు 200 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంది. నవంబర్ నెలలో చైనా దేశంలో బయటపడిన ఈ వైరస్ కేవలం నాలుగే నాలుగు నెలల్లో దాదాపు 200 దేశాలలో కొన్ని లక్షల మనిషి శరీరాలలో పొంచి ఉంది. ఇదే టైమ్ లో కొన్ని వేల మరణాలు ఈ వైరస్ వల్ల ప్రపంచంలో సంభవిస్తున్నాయి. దీంతో ఈ వైరస్ వచ్చిన సందర్భం నుండి మనిషి భయాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా రకాలుగా సమాజంలో మనుషులు..కొన్ని రకాల చిట్కాలు చెబుతున్న విషయం మనకందరికీ తెలిసినదే.How vicious is the use of vyagra – Daily Newsప్రారంభంలో ఈ వైరస్ వచ్చిన టైం లో గోమూత్రం తాగితే వైరస్ దగ్గరికి రాదని, అంతేకాకుండా వేపాకులు జోబులో వేసుకున్న వైరస్ శరీరాన్ని టచ్ చేయాలంటేనే భయపడుతుందని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు మనిషి శరీరంలో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా ని వాడటం వల్ల కరోనా వైరస్ నీ ఎదురు కోవచ్చని అంటున్నారు అమెరికా మరియు యూరప్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు. ఈ మందులో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాధి గ్రస్తులకు వాడుతున్నారు.

 

ఊపిరితిత్తుల పై ప్రభావం చూపే కరోనా వైరస్ నీ ఎదురుకొనే పేషెంట్ కి నైట్రిక్ ఆక్సైడ్ ఇవ్వటం వలన…ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం అంతగా ఉండటం లేదని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తేల్చరట. అయితే వచ్చిన ఈ వార్తలను అంతర్జాతీయ స్పెషలిస్ట్ వైద్యులు…అసలు వయాగ్రా కి, కరోనా వైరస్ కి సంబంధం లేదని…ఆ వార్తలు అంతా ఫేక్ అని, కొత్త కొత్త పుకార్లతో ప్రజలలో భయాందోళనలు కలిగించవద్దు అని అంటున్నారు. ప్రజలు కూడా ఇలాంటి వాటిని నమ్మొద్దని పొరపాటున లాక్ డౌన్ టైం లో వయాగ్రా వాడారు అంటే…అనేక పొరపాట్లు జరుగుతాయి అని హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం కరోనా లక్షణాలు ఉన్నా మీ మీ దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు పాటించాలని ప్రజలకు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news