జ‌నాలు మ‌ర్చిన వైసీపీ ఎంపీకి క‌రోనాతో క‌రుకొచ్చిందే…..?

-

రాజ‌కీయాలంటేనే సేవ‌. అది ఏరూపంలో అయినా ఉండొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు దేశం, రాష్ట్రం కూడా తీవ్ర విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ప్ర‌జాప్ర‌తినిధులు కాళ్లు ముడుచుకుని ఇంట్లో కూర్చోకుండా ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక రూపంలో సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్పందించ‌క పోయినా.. ఇప్పుడు సీఎంలు, ప్ర‌ధాని కూడా పిలుపు నిచ్చిన నేప‌థ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా త‌మ వేత‌నాలు, నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి నిధుల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచుతున్నారు.  ఒక్కొక్క‌రు ఎంపీలు కోటి రూపాయ‌ల‌కు త‌గ్గ‌కుండా సాయం చేయాల‌ని నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. దీంతో ఎంపీలంద‌రూ కూడా సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

అయితే, ఇక్క‌డో కీల‌క ప్ర‌శ్న తెర‌మీద‌కి వ‌చ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ స‌మయంలో కేవ‌లం డ‌బ్బులు ఇచ్చి స‌రిపెడ‌తారా? ఇంకేమైనా చేస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఎమ్మెల్యేలు రోడ్ల మీద‌కి వ‌చ్చి మ‌న రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. క‌లివిడిగా ఉండ‌కుండా విడివిడిగా ఉండ‌డం వ‌ల్ల క‌రోనాను త‌రిమి కొట్టొచ్చ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఎమ్మెల్యేలు ఈ ప‌నిచేస్తేంటే.. ఎంపీలు మాత్రం నిధులు ఇచ్చి కేవ‌లం ట్విట్ట‌ర్‌లో మాత్ర‌మే త‌మ సందేశాలు పంచు తున్నారు. కానీ, వీరికి భిన్నంగా ఓ ఎంపీ మాత్రం రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ప్ర‌జ‌ల‌కు త‌న‌దైన శైలిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. దీంతో ఆ ఎంపీ పేరు సోష‌ల్ మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఆమె వంగా గీత‌.

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ఎంపీ వంగ గీత త‌న‌దైన శైలిలో క‌రోనాపై పోరు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తు న్నా రు. ప్ర‌స్తుతం లాక్ డౌన్ రిలీఫ్ స‌మ‌యంలో ఆమె బ‌హిరంగ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శిస్తున్నారు. సామర్లకోట కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్‌కు వచ్చిన మహిళలకు మాస్కులు లేకపోవడంతో వారికి మాస్కుల ప్రాధాన్యం వివ‌రించారు. తానే స్వ‌యంగా మహిళల చీరల కొంగుతో వారికి స్వయంగా మాస్కు కట్టారు. బయటకు వచ్చేయుందు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎంపీ సూచించారు.

అలాగే మార్కెట్‌లోని కూరగాయల వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఎంపీ గీత అవగాహన కల్పించారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని సూచించారు. మొత్తానికి మిగిలిన ప్ర‌జాప్ర‌తినిదుల మాదిరిగా కాకుండా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకొనేందుకు గీత ప్ర‌య‌త్నించార‌ని సోష‌ల్ మీడియాలో ఆమెపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఆమె ఎంపీగా గెలిచి యేడాది అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ప్ర‌జ‌ల్లోకి రాలేదు. ఇక ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్‌తో బ‌య‌ట‌కు రావ‌డంతో పాటు మీడియాలో హైలెట్ అవుతుండ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news