రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అదికారంలో ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా కర్నూలు జిల్లా నందికొ ట్కూరు నియోజకవర్గంలో సమన్వయకర్తకు, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే కు మధ్య తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు సాగుతుండడం పార్టీ పరువు తీస్తోంది. ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరులో గత ఎన్నికల్లో ఆర్ధర్ విజయం సాధించారు. కొన్నాళ్లు ఆయనే ఏకఛత్రాధి పత్యం సాగిం చారు. అయితే, మధ్యలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోయినా.. పార్టీ తరఫున ఇంచార్జ్ పీఠం దక్కించుకున్నారు.
అప్పటి నుంచి ఆయన ఈ నియోజకవర్గంలో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నే ఆర్ధర్ నెంబర్ 2 అయిపోయారు. ఈ పరిణామాలతో ఆర్ధర్ తీవ్రస్థాయిలో మనస్తాపానికి గురయ్యారు. తన నియోజకవర్గంలో ఇంచార్జ్ పెత్తనంపై ఆయన కొన్నాళ్లు పాటు తీవ్రస్తాయిలో ఫైరయ్యారు అయితే, పార్టీ లోని కొందరు కీలక నాయకులు బైరెడ్డికి సపోర్ట్ చేయడం, అధిష్టా నం నుంచి కూడా ఆర్ధర్కు సపోర్టు లేక పోవడంతో ఇప్పుడు పూర్తిగా పార్టీ వ్యవహారాలన్నీ బైరెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నాయి.
ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినా.. సీట్ల కేటాయింపులో మాత్రం బైరెడ్డే అన్నీ అయి వ్యవహరించారని సమాచారం. మొత్తం నందికొట్కూరు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. దీంతో ఆర్ధర్ తనకు మూడు మండలాల్లోని ఎంపీటీసీ జడ్సీటీసీ సీట్లను ఆశించారు. కానీ, బైరెడ్డి మాత్రం రెండు మాత్రమే ఆయనకు ఇస్తానని చెప్పారు. దీనిపైనా ఆర్ధర్పెద్ద ఎత్తున పంచాయతీ పెట్టారు. అయినా కూడా సీనియర్ నాయ కుల నుంచి కూడా ఆర్ధర్ కు ఉపశమనం లభించలేదు. పాములపాడు, జూపాడుబంగ్లా రెండు మండలా లతోనే ఎమ్మెల్యే సరిపెట్టుకోవాలని పార్టీ పెద్దలు సూచించారు.
దీంతో ఆర్థర్ ఆశలు ఆవిరైపోయాయి. పోనీ నోరు విప్పి.. తిరుగుబాటు చేద్దామా? అంటే.. స్వతంత్రంగా ఆయన విజయం సాధించిన దానికంటే కూడా జగన్ బలంతో గెలుపు గుర్రంఎక్కిందే ఎక్కువ. దీంతో ఇప్పుడు అటు పార్టీ సీనియర్లను ఎదిరించలేక, బైరెడ్డి ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక ఆర్ధర్ అలిసి సొలిసిపోతున్నారు మరి దీనిపై ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.