పెట్టుబడుల సాధనలో జగన్ సర్కార్ అగ్రగామి….!

-

ఏపీలో అభివృద్ధి జరగటం లేదని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు ధీటుగా బదులిస్తోంది వైసీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో విపత్కర పరిస్థితులున్నాయనేది బహిరంగ రహస్యం. అమరావతి గ్రాఫిక్స్ తప్ప కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏవీ లేవని అప్పట్లో మేధావులు, రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చేసింది తక్కువ.. చెప్పింది ఎక్కువ అన్నట్లుగా గత ప్రభుత్వ తీరు సాగిందనేది వాస్తవం. అయితే జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలకు మార్గం సుగమం చేశారు. పెట్టుబడిదారులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం.

ys jagan

మౌలిక వసతుల కల్పనతో పాటు రాయితీలిస్తూ.. పారిశ్రామిక రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారు జగన్. ఇక గతంలో ఎన్నడూ జరగని రీతిలో విశాఖలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఇందులో అంబానీ, అదానీ వంటి కార్పోరేట్ దిగ్గజాలు పాల్గొన్నారు. విశాఖ సదస్సులో ఏకంగా రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. కడప స్టీల్ ప్లాంట్, భోగాపురం విమానాశ్రయం, సాఫ్ట్‌వేర్, ఫార్మా, విద్యా, వైద్య రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. భారీ పరిశ్రమలు స్థాపించేందుకు బడా కంపెనీలు క్యూ కట్టాయనేది వాస్తవం.

తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి పలు పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ.19 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో చేసుకున్న ఒప్పందంలో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద రిలయన్స్ పవర్ ఆధ్వర్యంలో రూ.6174 కోట్ల పెట్టుబడితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలిపింది.

పవర్ ప్రాజెక్టు ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా… మరో రెండువేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దీంతోబాటు ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అలాగే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం దగ్గరున్న పారిశ్రామికవాడలో స్మైల్ కంపెనీ రూ. 166 కోట్లతో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల దాదాపు 5 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇదే సెజ్ లోని ఏటీసీ టైర్స్ సంస్థ రూ. 679 కోట్లతో మరింత విస్తరించనుంది. దీనిలో కొత్తగా 300 మందికి ఉద్యోగాలు వస్తాయి.

రాజమండ్రి సమీపంలోని కడియం వద్ద ఆంధ్ర పేపర్ మిల్లు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం సంస్థ రూ.4 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని వల్ల కొత్తగా 3 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. వీటితో పాటు ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద వెంకటేశ్వర బయోటెక్ సంస్థ, తిరుపతిలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ సంస్థలు తమ పరిధిని మరింత విస్తరించనున్నాయి. వీటి వల్ల కొత్తగా 2500 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇక పోతే ఉత్తరాంధ్రలో భారీ పరిశ్రమకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయనగరంలోని ఎస్. కోట వద్ద రూ. 531 కోట్లతో JSW ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రత్యక్షంగా 35,750 మందికి , పరోక్షంగా 9375 మందికి ఉపాధి లభిస్తుంది.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేదని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు జగన్ సర్కార్ చర్యలు మింగుడు పడటం లేదు. ఓ వైపు పారిశ్రామిక రంగాన్ని ప్రొత్సహిస్తూ… దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ పథకాలు అమలుకు జగన్ సర్కార్ ఖర్చు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news