పొత్తు పవన్ డిసైడ్ చేశారా? బాబుకు ఆప్షన్ లేదా?

-

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఎవరికి అర్థం కాకుండా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో టిడిపి కార్యకర్తలు నేతలు నిరాశకు లోనయ్యారు. టిడిపిని నడిపించే నాయకుడి కోసం చూశారు. కష్టంలో ఉన్న లోకేష్ కి టిడిపికి భరోసా ఇస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు పార్టీల పొత్తు అంటూ వారి ఆశలకు జీవం పోశారు.

చంద్రబాబును పరామర్శించడానికి లోకేష్ తో కలిసి రాజమహేంద్రవరం వెళ్లిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత టిడిపి జనసేన ఇద్దరు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అందరూ అనుకున్న ఈ సమయంలో  ప్రకటిస్తారు అని ఎవరు అనుకోలేదు.

అయితే పొత్తు పై అంతకముందు నుంచే చర్చ నడుస్తుంది..కానీ ఫిక్స్ కాలేదట. జైలులోనే మొత్తం జరిగిందని తెలుస్తోంది.  జైలులో చంద్రబాబును చూసిన పవన్ చాలా బాధపడ్డారట. ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తిని జైల్లో పెట్టడం వైసిపి క్రూరత్వానికి పరాకాష్ట అన్నారు. బాబుని చూసిన వెంటనే బాధపడిన పవన్ కళ్యాణ్ టిడిపి జనసేన పొత్తుపై పవన్ అప్పటికప్పుడు చంద్రబాబు ముందు ప్రతిపాదన తెచ్చారని, మీరు ఒప్పుకుంటే వెంటనే కార్యాచరణ ప్రకటిదామని పవన్ అన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పవన్ ప్రతిపాదనకు చంద్రబాబు, లోకేష్ ఓకే చెప్పారని తెలుస్తోంది. లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య తదుపరి కార్యాచరణ గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అరాచక పాలన స్వస్తి పలకడానికి టిడిపి జనసేన  పొత్తు పెట్టుకుందని పవన్ అన్నారు. ఈసారి వైసీపీని ఇంటికి పంపించడమే తన లక్ష్యమని పవన్ అన్నారు. మొత్తానికి పవన్ పొత్తు గురించి చెబితే..బాబుకు వేరే ఆప్షన్ లేక ఒప్పుకున్నారని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news