మాజీ మంత్రి సోమిరెడ్డికి టికెట్ లేనట్టే.. తెరపైకి రోజుకో పేరు..

-

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది.. దశాబ్దాల కాలం పాటు తెలుగుదేశం పార్టీలో అన్ని తానై వ్యవహరించిన ఆయనకు అధినేత చంద్రబాబు చెక్ పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి బరిలో ఉంటారని ఆయన అనుచరులు భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది.. తొలి జాబితాలో ఆయనకు టికెట్ దక్కక పోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

నెల్లూరు జిల్లా టిడిపి రాజకీయాలు దశాబ్దాల కాలం పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి. ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా చంద్రబాబు సైతం తల ఊపే వారట.. అయితే వరుసగా నాలుగు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని.. ఈసారి పక్కన పెట్టేయాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారట.. అందుకే తొలి జాబితాలో అతను టికెట్ లేకుండా జాగ్రత్త పడ్డారని.. అతని స్థానంలో కొత్త వారి పేర్లను అధిష్టానం పరిశీలిస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి..

సోమిరెడ్డి స్థానంలో టిడిపి రాష్ట్ర కార్యవర్గ నిర్వాహకులు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై చంద్రబాబు సర్వేలు చేస్తున్నారట.. IVRS సర్వే పేరుతో కొద్దికాలంగా టిడిపి నేతలకు నియోజకవర్గ ప్రజలకు ఫోన్లు వస్తున్నాయని…అందులో ఇటీవల tdp లో చేరిన రూప్ కుమార్ యాదవ్ పేరు కూడా వస్తుందనీ పార్టీ నేతలు చెబుతున్నారు..

టికెట్ రాదని మాజీ మంత్రి సోమిరెడ్డి అధిష్టానం పై అసంతృప్తిలో ఉన్నారని అయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఆయనకి ఈసారి టికెట్ రాకపోతే సోమిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఉండదని సర్వేపల్లి నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది. సోమిరెడ్డికి టికెట్ రాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది మోకాలు అడ్డుతున్నారని ప్రచారం జరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news