ఎన్నికల బరిలో గద్దర్ వారసుడు..సీటు అదేనా?

-

ప్రజా గాయకుడు…తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై పాట రూపంలో గళం విప్పే గద్దర్..ప్రజా యుద్ధనౌక అనే పార్టీ కూడా పెట్టుకున్నారు. అయితే రాజకీయంగా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఈయన రాజకీయంగా ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు..అన్నీ పార్టీల నేతలతో సన్నిహితంగా ఉంటారు.

కానీ ఎక్కువగా ఈయన కాంగ్రెస్ తో సఖ్యతగా ఉన్నట్లు కనబడతారు. 2018 ఎన్నికల్లో టి‌డి‌పి-కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో..ఆ పొత్తుకు మద్ధతు ఇచ్చారు. చంద్రబాబు, రాహుల్ గాంధీలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత కూడా గద్దర్..కాంగ్రెస్ తో ప్రయాణం సాగించారు. మధ్య మధ్యలో బి‌జే‌పి సభల్లో మెరిశారు. ఇలా అన్నీ పార్టీలతో ఆయన సఖ్యతగానే ఉంటారు. ఇటీవల ఆయన చనిపోయినప్పుడు అన్నీ కాంగ్రెస్ నేతలు దగ్గరుండి చూసుకున్నారు. ఆయన్ని సొంత మనిషి మాదిరిగా కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గద్దర్ తనయుడు సూర్య..పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గద్దర్ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Gaddar Son Surya

అయితే గత ఎన్నికల్లోనే గద్దర్ తన తనయుడుకు సీటు ఇప్పించుకోవాలని చూసారట. దాదాపు సీటు ఖరారయ్యాక చివరి నిమిషంలో సీటు దక్కలేదని తెలిసింది. ఈ సారి మాత్రం కాంగ్రెస్ పిలిచి మరి సీటు ఇస్తుందని ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు గాని, పెద్దపల్లి ఎంపీ సీటు గాని ఇస్తారని తెలుస్తోంది.

ముందు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి..మొదట అసెంబ్లీ సీటు ఇవ్వడానికే చూస్తున్నారని, అది కుదరని పక్షంలో ఎంపీ సీటు ఇస్తారని తెలుస్తోంది. చూడాలి మరి గద్దర్ వారసుడు పోటీ చేస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news