కరోనా తీవ్రతను తేలిగ్గా తీసుకున్న రాష్ట్రాల్లో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానములో ఉందని చెప్పడంలో ఎలాటని సందేహం లేదు. అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విడుస్తున్న సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి కరోనాపై ఎంత అవగాహన ఉందొ తెలుస్తుంది. పారా సీటమాల్ వేసుకుంటే, బ్లీచింగ్ పొడి చల్లితే కరోనా పోతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రజలు కూడా కరోనా ను సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం చెయ్యి జారీ పోయేలా ఉన్నాయి. దేశంలో కరోనా ప్రారంభమైనపప్పుడు మిగితా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి. అప్పుడే నాయకులు, అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టి ఉంటే రాష్ట్రంలో ఇప్పడు పరిస్థితులు ఇంకోలా ఉండేవి. మొన్నటికి మొన్న కృష్ణ జిల్లాలో కరోనా లేదని ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఇప్పుడు కృష్ణలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంది. అలాగే గుంటూరు జిల్లాలో కూడా వ్యాధి వ్యాప్తికి అధికార పార్టీ మంత్రి బందులువులే కారణమని వార్తలు బయటకు వచ్చాయి.
మందు లేని మహమ్మారి రాష్ట్రంలో విజృబించినప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేసి ప్రజల్లో చైతన్యం కలిపించాలి. కేరళలో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పరచి ప్రజలను చైతన్య పరిచారు. అలా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతిపక్ష నాయకుడు, అధికార పక్ష నాయకుడు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పరచి, ప్రజలను చైతన్యం చేసి ఉంటే రాష్ట్రంలో కరోనా విస్తృతిని చాలా వరకు తగ్గించడంలో తోడ్పడేది.