సిద్ధూకు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డే ఆదర్శమా….

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తిట్టే విధానం ఆయన ను ఇరుకున పెట్టే తీరుతో కాంగ్రెస్ నేతలందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులందరూ వ్యతిరేఖించారు. అయినా కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపడం గమనార్హం.కానీ పీసీసీ ఛీఫ్ గా పగ్గాలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి ఒక్కక్క కాంగ్రెస్ సీనియర్ నేత వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. వారందరినీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. సేమ్ ఇటువంటి పరిస్థితే పంజాబ్ లో ఉంది. అక్కడ టీపీసీసీ ఛీఫ్ గా నియమితులైన మాజీ క్రికెటర్ సిద్ధూ Sidhu నాయకత్వాన్ని అక్కడి సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ వ్యతిరేఖిస్తున్నారు. కానీ ఆయన కూడా ఒక్కొక్క సీనియర్ కాంగ్రెస్ నేతల వద్దకు వెళ్లి…. తన నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నాడు. సీనియర్ల సహకారం ఉంటేనే … పార్టీని పట్టాలెక్కించడం సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఇదిలా ఉండగా…. పంజాబ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడం గమనార్హం. సీనియర్లందరూ తనకు సహకరిస్తేనే పార్టీని మరలా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వీలు పడుతుందని సిద్ధూ పేర్కొంటున్నారు. ఇలా తనను వ్యతిరేఖించిన వారిని కూడా కలుపుకుని పోవడంలో ఆయన టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నాట్లు తెలుస్తోంది. కాగా… వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో సిద్ధూ నాయకత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో? లేదో వేచి చూడాలి.