2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అధికారంలోకి రాకపోవడంతో టీడీపీలో చేరి పోయారు 23 మంది ఎమ్మెల్యేలు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలుకాగా, వైసీసీ అఖండ విజయం సాధించింది. ఈనేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అధిక శాతం మళ్లీ సొంతగూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు. వీరంతా మధ్యవర్తిత్వం కోసం వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలయిన 23 మంది పార్టీ మారడంతో వారి రాజకీయ భవిష్యత్తు మా రిపోయింది. ఇందులో కొందరికి టిక్కెట్ దక్కినా ఓటమి పాలయితే, మరికొందరు టిక్కెట్లు దక్కక 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. వైసీపీ అధినేత జగన్ పై నమ్మకం లేక కొందరు, అ ధికారం కోసం మరికొందరు వైసీపీని వీడారు. పార్టీని వదలి వెళుతూ జగన్ పైనా, వైసీపీపైనా విమర్శలు చేశారు.కొందరు ఏపీలో చంద్రబాబు అభివృద్ధి చూసే వెళుతున్నామని చెప్పారు.
జగన్ ను ఏమీ అ నకుండా పార్టీ మారిపోయారు. కాగా 2019 ఎన్నికల్లో వీరిలో ఒక్క గొట్టిపాటి రవికుమార్ తప్ప అందరూ ఓటమిపాలయ్యారు. దీంతో వీరిలో అనేక మంది తిరిగి ఫ్యాన్ గాలి కోసం ఉబలాటపడుతున్నారు. వీరికి టీడీపీ తో పెద్దగా సంబంధాలేవీ లేవు. తాము పార్టీలోకి వచ్చినా నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్, నేతలు సహకరించలేదన్న అసంతృప్తితో రగలిపోతున్నారు. తాజాగా టీడీపీ కూడా అధికారంలోకి రాకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈక్రమంలోనే ఎస్వీ మోహన్ రెడ్డి లాంటి నేతలు ఎన్నికలకు ముందు గానే వైసీపీలో చేరారు. మొత్తం 23 మందిలో దాదాపు పదిహేను మంది తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దీంతో వీరిలో కొందరు నేతలు విజయసాయిరెడ్డిని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ఆయనను కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ తో మాట్లాడిన తర్వాత ని ర్ణయం చెబుతామని ఆయన వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం.
తమను పార్టీలోకి తీసుకున్నా ఎ లాంటి పదవులను ఆశించమని, పార్టీ పటిష్టతకు పనిచేస్తామని వారు చెప్పినట్లు గా తెలుస్తోంది. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలు విజయసాయిరెడ్డిని కలసిన వారిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో జగన్ కూడా వీరి చేరికలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.