అతన్ని పక్కన పెట్టిన జగన్.. కారణం అదేనా..?

బైరెడ్డి సిద్దార్థ రెడ్డి” ఆంధ్రప్రదేశ్ లో గత మూడేళ్ళు గా ఎక్కువగా వినపడుతున్న పేరు. రాజకీయ ఉద్దండులను సైతం ఎదుర్కొని వైసీపీ కోసం నందికోట్కూరు నియోజకవర్గంలో రాత్రి అనక పగలు అనక కష్టపడిన యువనేత. స్వయంగా కుటుంబం నుంచే ఇబ్బందులు వచ్చినా సరే భయపడకుండా రాజకీయం చేసి నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం అన్ని విధాలుగా కష్టపడి తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పణంగా పెట్టిన యువనేత. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సిద్దార్థ రెడ్డికి నియోజకవర్గంలో, ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది… ఆయన్ను ఇన్నాళ్ళు నెత్తిన పెట్టుకుని మోసిన వాళ్ళే ఇప్పుడు పక్కన పెట్టారు.

అసలు దీనికి కారణం ఏంటి..? ఎన్నికలు అయిన వెంటనే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నా సరే ఆయన ప్రాధాన్యతను తగ్గించోద్దు అని భావించిన ముఖ్యమంత్రి జగన్… నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత ఏ పని కావాలన్నా సరే ఎమ్మెల్యే ని కాకుండా సిద్దార్థ రెడ్డినే కలిసే వాళ్ళు నియోజకవర్గ ప్రజలు. అయితే ఇది ఎక్కడ తేడా వచ్చిందో ఏమో గాని… నియోజకవర్గంలో సిద్దార్థ రెడ్డి వివాదాస్పద వ్యక్తిగా మారిపోయారు.

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు సిద్దార్థ రెడ్డి… దీనికి కారణం ఆయన దూకుడే అనేది కొందరి మాట. దీనితో జగన్ ఆయనకు ప్రాధాన్యత తగ్గించడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో సిద్దార్థ రెడ్డి ఏం చెప్పినా సరే చేయొద్దని ఆదేశాలు కూడా ఇచ్చారట. ఆయనకు డీసీసీబి పదవి వస్తుందని భావించారు అందరూ… కర్నూలు జిల్లాల్లో 12 డీసీసీబిలు ప్రకటించినా ఒక్క దాంట్లో కూడా ఆయన పేరు లేదు. 26 ఏళ్ళకే రాజకీయాల్లో సంచలనం అయిన సిద్దార్థ రెడ్డి… నేడు దూకుడు తో ఇబ్బందులు పడుతున్నారు. ఆయన దూకుడు తగ్గిస్తే గాని ప్రయోజనం ఉండదని అంటున్నారు జిల్లా నేతలు.