జగన్ అమరావతి ద్రోహి..అమరావతిని నాశనం చేశారు. మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని దెబ్బకొట్టారని చెప్పి టిడిపితో సహ అమరావతి రైతులు, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కావాలని అమరావతిని నాశనం చేశారని జగన్ పై విరుచుకుపడుతున్నారు. కానీ జగన్ అన్నీ ప్రాంతాలు బాగుండాలని చూస్తున్నారు..కేవలం ఒక ప్రాంతమే అభివృధ్ది చెందాలని ఆయన అనుకోవడం లేదు..అందుకే మూడు రాజధానులు తీసుకొచ్చారు.
కానీ దానిపై కేసులు వేసి అడ్డుకుంటున్నారు. అయినా సరే జగన్ ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికే తన పాలనలో పేదరికాన్ని తగ్గించి పేదల మనిషి అనిపించుకున్న జగన్..అమరావతికి చుట్టూ పక్కల ఉన్న పేద ప్రజలకు అండగానే నిలుస్తున్నారు. అందుకే రాజధాని అమరావతి ప్రాంతంలో సుమారు 50 వేలకు పైనే పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు.కానీ డీనిపై కేసులు వేసి అడ్డుకోవాలని టిడిపి సహ కొందరు పెత్తందార్లు కుట్రలు చేశారు. కానీ కోర్టు వారికే మొట్టికాయలు వేసింది.
అయితే ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన జగన్ ఇప్పుడు..ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. దీనికి వ్యతిరేకంగా అమరావతిలో ఉద్యమం పేరుతో పెయిడ్ రాజకీయం చేస్తున్న వారు చూస్తున్నారు. కానీ జగన్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే పనిచేస్తున్నారు. ఇక ఎవరు ఎలాంటి రాజకీయం చేసిన అమరావతిలోనే పేదలు సైతం జగన్ వైపే ఉన్నారు. ఎవరో కొంతమంది పెత్తందార్లు తప్ప పేదలు జగన్ పక్షాన ఉన్నారు. వారు మళ్ళీ జగన్ కే ఓటు వేయనున్నారు.
గత ఎన్నికల్లో టిడిపి అమరావతిని ఎంత హడావిడి చేసిన ఆ పరిధిలోని తాడికొండ, మంగళగిరి, తెనాలి, పెదకూరపాడు, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, పొన్నూరు లాంటి స్థానాలని వైసీపీనే గెలుచుకుంది. ఇక ఈ సారి కూడా అమరావతి చుట్టూ ఉన్న అసెంబ్లీ స్థానాలని మళ్ళీ వైసీపీ గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు.