జగన్ ప్లాన్ మామూలుగా లేదు…వాళ్ళని తిప్పేసినట్లే…

జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అవుతుంది….అయితే రెండున్నర ఏళ్లలో తాను ఎన్నికల ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. సంక్షేమ పథకాలు అమలులో దేశంలో జగనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారని చెప్పొచ్చు. కాకపోతే అభివృద్ధి విషయంలో కాస్త వెనుకబడి ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. ప్రతిపక్ష టి‌డి‌పి అయితే సి‌ఎంగా జగన్ టోటల్‌గా ఫెయిల్ అయ్యారని విమర్శిస్తుంది. కానీ టి‌డి‌పి విమర్శలని ప్రజలు అసలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. మెజారిటీ ప్రజలు ఇంకా వైపే ఉన్నారని తెలుస్తోంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమ పథకాల అమలు చేయడంతో ప్రజలు జగన్‌ పక్షాన నిలబడుతున్నారు.

jagan
jagan

ముఖ్యంగా మహిళలు మెజారిటీ సంఖ్యలో జగన్‌కు మద్ధతు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది. మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. ఆ విషయం గత ఎన్నికల్లోనే అర్ధమైంది. మహిళల బట్టే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని చెప్పడంలో ఎలాటి అతిశయోక్తి లేదు. అందుకే మహిళల మద్ధతు పొందటానికి జగన్ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో ముందుకొస్తూనే ఉన్నారు.

అందుకే మహిళలకే సంబంధించే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పెన్షన్‌లో ఎలాగో మహిళలకు వాటా ఉంది. అయితే మహిళల కోసం సెపరేట్‌గా అమ్మఒడి తీసుకొచ్చారు. పిల్లల చదువుల కోసం రూ. 15 వేలు తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. ఇక 45 ఏళ్ళు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 ఇస్తున్నారు. 45 ఏళ్ళు పైబడిన కాపు మహిళలకు కాపు నేస్తం పథకం కింద రూ. 15 వేలు ఇస్తున్నారు. ఇక వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నారు.

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు మహిళలకు ఇస్తున్నారు. అటు పదవుల్లో కూడా 50 శాతం మహిళలకే కేటాయించారు. అంటే మహిళలకు జగన్ పూర్తి స్థాయిలో మద్ధతుగా నిలబడుతున్నారు. ఇక వారు కూడా జగన్‌కే సపోర్ట్ ఉంటారని అర్ధమవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మహిళలే కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. మెజారిటీ మహిళలు జగన్ వైపే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.