శానిటైజర్ మీద జగన్ బొమ్మ…!

69

కరోనా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎక్కడ చూసినా కరోనా భయం ప్రజలను వెంటాడుతుంది. ఇప్పటికే పలు దేశాలు ఈ వైరస్ నివారణకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. విమానాలు రద్దు చేశాయి. ఇతర దేశాల నుంచి రాకపోకలు ఆపేసాయి. భారతదేశం కూడా కరోనా నివారణకు తీసుకోవల్సిన అన్ని చర్యలు మొదలు పెట్టింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి.

అన్ని చోట్ల ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే వైసీపీ నేత ఒకరు ఒక అడుగు ముందుకు వేసి సానిటైజర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి శానిటైజర్ బాటిల్‌ పై సీఎం జగన్, మరియు అతను కలిసి ఉన్న ఫోటోలను ముద్రించి నియోజకవర్గంలోని ఇంటింటికీ ఈ శానిటైజర్‌తో పాటు మాస్క్‌లు ఫ్రీగా ఇస్తు న్నారు.

దీంతో పలువురు నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనకి గల స్వామి భక్తిని ఈ రకంగా చాటుకుంటున్నారు అని అంటున్నారు. ఇప్పటికే కొందరు నెల్లూరు జిల్లా నేతలు వైసీపీ జెండా రంగులతో మాస్కులు తయారు చేయించి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇలా ఏదో ఒక రూపంలో ఏపీ నేతలు ఇటు జగన్ పై తమకు గల అభిమానాన్ని, అటు కరోనా నివారణకు తమవంతు కృషి చేస్తున్నారు.